మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 6 ఆగస్టు 2018 (10:05 IST)

కూతురుతో మాట్లాడవద్దని టెడ్డీబేర్‌తో అత్తను హతమార్చిన టెన్త్ విద్యార్థి...

కూతురుతో మాట్లాడవద్దని హెచ్చరించడంతో ఓ టెన్త్ విద్యార్థి ఏకంగా తన అత్తనే హత్యచేశాడు. అదీకూడా టెడ్డీబేర్‌తో చంపేశాడు. ఆ తర్వాత చేతి మణికట్టు నరాన్ని కత్తితో కోసి ఏమీ తెలియనట్టుగా వెళ్లిపోయాడు. ఈ విషయాన

కూతురుతో మాట్లాడవద్దని హెచ్చరించడంతో ఓ టెన్త్ విద్యార్థి ఏకంగా తన అత్తనే హత్యచేశాడు. అదీకూడా టెడ్డీబేర్‌తో చంపేశాడు. ఆ తర్వాత చేతి మణికట్టు నరాన్ని కత్తితో కోసి ఏమీ తెలియనట్టుగా వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆ విద్యార్థే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
 
చెన్నై నగరంలోని స్థానిక అంజికరైలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, అంజికరై వల్లలార్‌ వీధికి చెందిన శంకర్‌ సుబ్బు (45) అదే ప్రాంతంలో కిరాణ దుకాణం నడుపుతున్నాడు. ఈయన భార్య తమిళ్‌సెల్వి (40). వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె సమీపంలోని పాఠశాల్లో 8వ తరగతి చదువుతోంది. 
 
ఈ స్థితిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న తమిళ్‌సెల్వి చేతికి గాయంతో రక్తపు మడగులో పడివుంది. మధ్యాహ్నసమయంలో భోజనానికి ఇంటికి వచ్చిన శంకర్ సుబ్బు... తన భార్య స్పృహతప్పి ఉండటంచూసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. 
 
దీనిపై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ లోపు కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. ఇందులో తమిళ్‌ సెల్వి ఆత్మహత్య చేసుకోలేదని గొంతు నులమడంతో ఊపిరాడక మరణించినట్లు తేలింది. మృతి చెందిన తర్వాత చేతి మణికట్టుపై గాయం ఏర్పడినట్లు శవ రిపోట్లు తేల్చింది. 
 
ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు... సీసీ కెమెరా పుటేజీలను నిశితంగా పరిశీలించారు. అదే ప్రాంతంలో నివసిస్తున్న శంకర్‌సుబ్బు సోదరి కుమారుడు పదో తరగతి చదువుతున్న బాలుడు వచ్చి వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆ విద్యార్థిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరిపారు. ఆ సమయంలో విద్యార్థి తన అత్తను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. 
 
తన మామ శంకరసుబ్బు కుమార్తెపై తనకు ప్రేమ అని తాను ఆమెతో మాట్లాడటం అత్తకు నచ్చలేదన్నారు. ఆమె తనను ఇంటికి రావద్దని ఖండించడంతో ఆగ్రహంతో ఆమెను టెడ్డీబేర్‌తో హత్య చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత మణికట్టుపై కత్తితో కోసినట్లు తెలిపాడు. దీంతో తమిళ్ సెల్వి హత్యలోని మిస్టరీ వీడిపోయింది.