మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 6 ఆగస్టు 2018 (09:51 IST)

ఏటీఎంలోకి ఎద్దు.. పరుగులు తీసిన కస్టమర్లు.. ఎక్కడో తెలుసా?

ఏటీఎంలోకి సాధారణంగా డబ్బు తీసుకునేందుకు కస్టమర్లు వెళ్తూ వుంటారు. అయితే ఈసారి ఏటీఎంలోకి కస్టమర్లు కాకుండా బుల్ వచ్చింది. ఎక్కడెక్కడో తిరిగి అలిసిపోయిన ఆ వృషభం.. ఏటీఎంలోని ఏసీ హాయిగా కూర్చుని సేదతీరింద

ఏటీఎంలోకి సాధారణంగా డబ్బు తీసుకునేందుకు కస్టమర్లు వెళ్తూ వుంటారు. అయితే ఈసారి ఏటీఎంలోకి కస్టమర్లు కాకుండా బుల్ వచ్చింది. ఎక్కడెక్కడో తిరిగి అలిసిపోయిన ఆ వృషభం.. ఏటీఎంలోని ఏసీ హాయిగా కూర్చుని సేదతీరింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడిలో కనిపించింది. ఓ ఏటీఎం వద్ద సెక్యూరిటీగా ఎవరూ లేకపోవడం, తలుపు తీసుండటంతో ఆ ఎద్దు హాయిగా లోనికి వచ్చి పడకేసింది.
 
ఆ సమయంలో డబ్బులు తీసుకునేందుకు వచ్చిన చాలామంది ఎద్దును చూసి పారిపోయారు. మరో ఏటీఎంను వెతుక్కుంటూ వెళ్లి డబ్బు తీసేసుకున్నారు. మరికొందరు.. ఎద్దు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఏటీఎంలను ఇంత నిర్లక్ష్యంగా ఎలా నిర్వహిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.