సంబంధిత వార్తలు
- నా పరువు కంటే నా కూతురు ఎక్కువేం కాదు... ప్రణయ్‌ను చంపినందుకు బాధ లేదు... మారుతీరావు
- కేసీఆర్ నెక్స్ట్ టార్గెట్.. రేవంత్ రెడ్డేనా? టిలో వేడెక్కిన పాలి'ట్రిక్స్'
- ఒక్కసారి వస్తావా అంటూ.. మహిళా జర్నలిస్టును కన్నుకొట్టి వేధించిన లాయర్...
- మేనల్లుడు గెలుపు కోసమే అరెస్టు చేయించారు : తూర్పు జగ్గారెడ్డి
- జగ్గారెడ్డి అరెస్ట్... గుజరాత్‌లోని వ్యక్తులు మీ భార్య కుటుంబ సభ్యులెలా? పోలీస్ ప్రశ్న
సీతారామన్‌ను నేను కాల్చిపారేస్తాను. రేపే ఆమె జీవితంలో ఆఖరి రోజు....
కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను చంపేందుకు ఇద్దరు వ్యక్తులు చాటింగ్ చేసుకున్నారు. సీతారామన్‌ను నేను కాల్చిపారేస్తాను.. రేపే ఆమె జీవితంలో ఆఖరి రోజు అంటూ వాట్సాప్ సందేశాలు పంపించుకున్నారు.
కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను చంపేందుకు ఇద్దరు వ్యక్తులు చాటింగ్ చేసుకున్నారు. సీతారామన్‌ను నేను కాల్చిపారేస్తాను.. రేపే ఆమె జీవితంలో ఆఖరి రోజు అంటూ వాట్సాప్ సందేశాలు పంపించుకున్నారు. చివరకు ఈ సందేశాలే వారిని జైలు ఊచలు లెక్కించేలా చేశాయి. ఈ వివరాలను పరిశీలిస్తే...
ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్ జిల్లా ధర్చులాలో మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. మంత్రి పిథోర్‌గఢ్‌కు చేరుకోవడానికి ముందే సోమవారం ఉదయం వారిద్దరినీ అరెస్టు చేశారు. 'సీతారామన్‌ను నేను కాల్చిపారేస్తాను. రేపే ఆమె జీవితంలో ఆఖరి రోజు' అని వాట్సాప్ సందేశాలు పంపించుకున్నారు.
అదీకూడా పీకల వరకు మద్యం సేవించి వారు ఈ వాట్సాప్‌లో చాటింగ్ చేసుకున్నారు. ఇందుకోసం ప్రణాళిక కూడా రచించారు. ఈ విషయం ఆ నోటాఈనోటా చేరి చివరకు కేంద్ర నిఘా వర్గాలకు చేరింది. వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగాన్ని నిఘా వర్గాలు అప్రమత్తం చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు.. సందేశాలు పంపించుకున్న ఇద్దరు తాగుబోతులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పిథోర్‌గఢ్ ఎస్పీ రామ్‌చంద్ర రాజ్‌గురు తెలిపారు.
మద్యం మత్తులో ఉండి వారు మంత్రి గురించి మాట్లాడుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన చెప్పారు. ఐపీసీలోని 506, ఐటీ చట్టంలోని 66 సెక్షన్ల కింద వారిపై కేసు పెట్టి జైలుకు తరలించారు.
