1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం
  6. ఉసిరికాయలతో రసం

Usirikaaya Rasam | ఉసిరికాయలతో రసం

వంటకాలు శాకాహారం ఉసిరికాయలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ధనియాలపొడి మిరియాల పొడి కరివేపాకు
కావలసిన పదార్థాలు :
ఉసిరికాయలు.. 8
ఎండుమిర్చి... 2
ఆవాలు... పావు టీ.
జీలకర్ర... పావు టీ.
వెల్లుల్లి... 5 రెబ్బలు
ధనియాల పొడి... ఒకటిన్నర టీ.
మిరియాల పొడి... పావు టీ.
కరివేపాకు... రెండు రెమ్మలు
కొత్తిమీర... ఒక కట్ట
ఉప్పు... తగినంత
పప్పు తేట...గరిటెలు

తయారీ విధానం :
ఉసిరికాయలను రెండుగా విడదీసి ఆ ముక్కల్లో రెండుగ్లాసుల నీళ్లు పోసి ఉడికించి, తరవాత వడగట్టాలి. విడిగా ఓ గిన్నెను తీసుకుని కొద్దిగా నూనెవేసి ఆవాలు, జీలకర్రలతో తాలింపుపెట్టి అందులో పప్పుతేట, వడగట్టిన ఉసిరిరసం కలిపి స్టవ్‌మీద పెట్టాలి.

రసం కాస్త మరగగానే దంచిన వెల్లుల్లి, ధనియాలపొడి, మిరియాలపొడి, కొత్తిమీర, కరివేపాకు వేసి 5 నిమిషాల తరువాత దించాలి. చివరగా ఉప్పు సరిచూడాలి. ఇది అన్నంలోకి, ఇడ్లీలలోకి చాలా రుచిగా ఉంటుంది. మీరూ ట్రై చేయండి మరి..!!
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి