1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

నూడుల్స్ ఉప్మా

ఉద్యోగాలు చేసే గృహిణులు ఉదయం పూట చాలా హడావుడిగా వంటలు చేస్తుంటారు. అయినప్పటికీ
నూడుల్స్ ఉప్మా
ఉద్యోగాలు చేసే గృహిణులు ఉదయం పూట చాలా హడావుడిగా వంటలు చేస్తుంటారు. అయినప్పటికీ, పిల్లలు వాటిని సరిగ్గా తినకుండా వదిలేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో బజార్లో అమ్మే ఇంస్టాంట్ పదార్థాల వైపు మొగ్గు చూపిస్తుంటారు. అయితే సులువుగా ఇంట్లోనే చేసి పిల్లలకు రుచికరంగా పెట్టేలా నూడుల్స్‌తో కొన్ని వంటలు మీకోసం...

కావలసిన పదార్థాలు :
చింతపండు - నిమ్మకాయంత, నూడుల్స్ - రెండు కప్పులు, నూనె - 100 గ్రాములు, ఆవాలు - ఒక టీస్పూన్, ఉప్పు - తగినంత, మినపప్పు - ఒక టీ స్పూన్, శెనగపప్పు - ఒక టీస్పూన్, ఉప్పులో ఊరేసిన మిరపకాయలు - ఒక టీస్పూన్, కొత్తిమీర తురుము- పావుకప్పు.

తయారు చేయి విధానం :
ముందుగా చింతపండులో ఉప్పు వేసి నీళ్లు పోసి నానబెట్టాలి. ఆ తర్వాత అందులో రెండు కప్పుల నీళ్లు పోసి నూడుల్స్‌ను వేసి నానబెట్టాలి. మరో వైపు బాణాలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, శెనగపప్పు, మినపప్పు, ఉప్పు మిరపకాయలు వేసి దోరగా వేయించాలి.

ఆ తర్వాత చింతపండు నీళ్లలో నానబెట్టిన నూడుల్స్‌ను అందులో వేసి కాస్త అటు ఇటూ తిప్పి టీస్పూన్ నూనె వేసి తిప్పాలి. నూడుల్స్ ఉడికే వరకు ఉంచి దించి కొత్తిమీర తురుముతో డెకరేట్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT