1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

బంగాళాదుంప గారెలు

వంటకాలు చిట్కాలు బంగాళాదుంప సెనగపిండి బియ్యం ఉప్పు పచ్చిమిర్చి అల్లం ఆవాలు కరివేపాకు కొత్తిమీర ఇంగువ నూనె
FileFILE
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు...350 గ్రాములు
సెనగపిండి... 60 గ్రాములు
బియ్యం పిండి... ఒక టీస్పూన్
ఉప్పు... రెండు టీస్పూన్లు
పచ్చిమిర్చి... ఐదు
అల్లం... కొంచెం
ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర ఇంగువ, నూనె... తాలింపుకు సరిపడా

తయారీ విధానం :
ఉడికించిన బంగాళాదుంపల్లో సెనగ పిండిని చేర్చి, ఆ మిశ్రమానికి ఉప్పు, బియ్యం పిండి, నూనెలో వేయించిన ఆవాలు, పచ్చి మిరప కాయలను కలపాలి. అలాగే కొత్తిమీర, ఇంగువ, కరివేపాకులను కూడా దానికి చేర్చి ముద్దలా చేసుకోవాలి.

ఆ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని గారెల్లాగా కాగుతున్న నూనెలో బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే బంగాళాదుంపలతో గారెలు సిద్ధమైనట్లే... వీటిని వేడి వేడిగా గ్రీన్‌చట్నీతో నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి