1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

బెండ - టమోటో కూర

వంటకాలు శాకాహారం బెండకాయ టమోటో కూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర కారం ఉప్పు నూనె తయారీ విధానం
PTI PhotoPTI
కావలసిన పదార్థాలు :
బెండకాయలు... పావుకిలో
టమోటోలు... నాలుగు
ఉల్లిపాయలు... మూడు
పచ్చిమిర్చి... రెండు
అల్లం... చిన్నముక్క
వెల్లుల్లి... 4 రేకలు
జీలకర్ర... అర టీస్పూను
కారం... ఒక టీస్పూన్‌
ఉప్పు... సరిపడా
నూనె... వంద గ్రాములు

తయారీ విధానం :
బెండకాయలను అంగుళం సైజు ముక్కలుగా తరగాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా ముక్కలు తరగాలి. అల్లం, వెల్లుల్లి ముద్ద నూరుకొని ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి మరిగాక బెండకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసి దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన నూనెలో కరివేపాకు, జీలకర్ర వేసి కాస్త వేగిన తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి.

ఆ తరువాత అందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద, కారం వేసి చిన్న చిన్నగా కోసుకుని ఉంచుకున్న టమోటా ముక్కలను చివర్లో వేసి వేయించాలి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత వేయించి పక్కన ఉంచుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి ఒక కప్పు నీరు పోసి ఉడికించాలి. కూర చిక్కబడిన తర్వాత దించేయాలి. ఇష్టమైతే కొత్తిమీర చల్లుకోవచ్చు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి