1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం
  6. veg

వెల్లుల్లి పచ్చడి

వంటకాలు
కావలసిన పదార్థాలు :
వెల్లుల్లి రేకులు... ఐదు కప్పులు
ఉప్పు... ముప్పావు కప్పు
కారం... ఒక కప్పు
మెంతిపొడి... పావు కప్పు
జీలకర్ర... రెండు టీ.
ఆవపిండి... అర కప్పు
ఇంగువ... అర టీ.
నిమ్మరసం... ఒక కప్పు
నువ్వుల నూనె... రెండు కప్పులు
పసుపు... పావు టీ.

తయారీ విధానం :
వెల్లుల్లి రేకుల్ని పొట్టుతీసి శుభ్రం చేయాలి. ఓ బాణలిలో నూనె వేసి వేడి చేసి ఆవాలు, ఇంగువ, మెంతిపొడి, జీలకర్ర, పసుపు వేసి వేయించాలి. తరవాత వెల్లుల్లి వేసి బాగా కలపాలి. వీటిని వేరే జాడీలో వేసి ఉప్పు, కారం కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. చివరగా నిమ్మరసం వేసి బాగా కలిపిన తరవాత మిగిలిన నువ్వులనూనెను పచ్చడిమీద పోయాలి. అంతే కమ్మనైన వెలుల్లి పచ్చడి రెడీ అయినట్లే... దీన్ని గాలి చొరబడని బాటిళ్లలో నిల్వచేస్తే ఆరు నెలలపాటు పాడవకుండా ఉంటుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి