1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
  4. If you want get the teeth as wight colour? then use this tips?

పళ్లు పసుపుపచ్చగా ఉన్నవారు ఈ చిట్కాలు పాటిస్తే?

కాఫీ, టీ, కోలాలు ఎక్కువగా తాగడం వలన పళ్లు పసుప్పచ్చగా మారుతాయి. ఆ సమస్యను పొగొట్టేందుకు కొన్ని చిట్కాలు. ఈ చిట్కాలు పాటిస్తే ముత్యాల్లాంటి పలువరుసను మీ సొంతం చేసుకోవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.

wight
కాఫీ, టీ, కోలాలు ఎక్కువగా తాగడం వలన పళ్లు పసుప్పచ్చగా మారుతాయి. ఆ సమస్యను పొగొట్టేందుకు కొన్ని చిట్కాలు. ఈ చిట్కాలు పాటిస్తే ముత్యాల్లాంటి పలువరుసను మీ సొంతం చేసుకోవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
 
క్యారెట్, యాపిల్, కొత్తిమీర, కూరగాయలు, పండ్లను తరచూ ఆహారంతో పాటు తీసుకోవాలి. ఇవన్నీ పళ్లపై ఉండే ఎనామిల్‌కు హాని కలిగించకుండా సహాయపడుతాయి. పాలు, పాల పదార్థాలు తీసుకోవడం వలన నోటిలోని పీహెచ్ స్థాయిలు పెరిగి ఎనామిల్ పోకుండా ఉంటుంది. అరటిపండు, కమలాపండు తొక్క లోపలి భాగాలతో పళ్లపై మృదువుగా రుద్దుకుంటే పసుపుదనం తొలగిపోతుంది.
 
ఈ పండ్ల తొక్కల్లో ఉండే ఖనిజాలు మెగ్నిషియం, పొటాషియం, మాంగనీస్ ఎనామిల్‌కు రక్షణగా ఉంటాయి. పరిశుభ్రమైన చెంచా కొబ్బరినూనెను తీసుకుని 15 నిమిషాల పాటు పుక్కిలించాలి. ఈ నూనె నోట్లోని అన్ని భాగాలను తాకేల పుక్కిలించాలి. ఆ తరువాత నూనె ఉమ్మేసి నోరు శుభ్రం చేసుకొనిన వెంటనే రెండు గ్లాసుల నీరు త్రాగాలి. 
 
కొబ్బరినూనెలోని లారిక్ ఆమ్లం దంతాలపై పసుపుదనానికి కారణమయ్యే బ్యాక్టీరియాలను నశింపజేస్తుంది. టూత్‌పేస్ట్‌లో కాస్త ఉప్పును కలుపుకుని పళ్లను  తోముకుంటే దంతాలలో గల పసుపుదనం తొలగిపోయి వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలా కాకుంటే వంటసోడాను కూడా టూత్‌పేస్ట్‌లో వేసుకుని తోముకుంటే మంచి మార్పు కనిపిస్తుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
మహిళల్లో అతి దాహం.. అతి ఆకలి దేనికి కారణమంటే?