మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 1 జులై 2018 (13:12 IST)

అల్పాహారానికి తర్వాత డ్రైనట్స్ ఆఫీసుకు తీసుకెళ్తే?

అల్పాహారానికి తర్వాత ఆఫీసుకు డ్రైనట్స్, స్నాక్స్‌, బ్రెడ్‌ లాంటివి తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లంచ్ తీసుకునేలోపు తీసుకెళ్లిన డ్రైనట్స్, స్నాక్స్‌ తినాలని, ఖర్చవుతున్

అల్పాహారానికి తర్వాత ఆఫీసుకు డ్రైనట్స్, స్నాక్స్‌, బ్రెడ్‌ లాంటివి తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లంచ్ తీసుకునేలోపు తీసుకెళ్లిన డ్రైనట్స్, స్నాక్స్‌ తినాలని, ఖర్చవుతున్న కేలరీలకు తగ్గట్టుగా తిరిగి శక్తిని పొందగలుగుతారు. ముఖ్యంగా పాలు, కాఫీ తాగిన వెంటనే టిఫెన్‌ చెయ్యకూడదని ఆరోగ్య నిపుణులు తెలిపారు. 
 
అలాగే టిఫిన్‌ చేసిన వెంటనే వాటిని తాగకూడదు. మధ్యలో గంట సమయాన్నయినా తీసుకోవాలి. త్వరగా అరిగే ఇడ్లి, ఉప్మా లాంటిలి తీసుకున్నప్పుడు అరగంట తర్వాత ఏమన్నా తిన్నా, తాగినా పర్వాలేదు. నిద్రలేవగానే ఒక్కోసారి బయటకు వెళ్లాల్సి వస్తే వెంటనే టిఫిన్ చేయకుండా ప్రయాణంలో తీసుకునే ప్రయత్నం చేయండి. దీనివలన జీర్ణవ్యవస్థ సక్రమంగా, క్రమబద్ధంగా పనిచేస్తుంది.
 
బాదంపప్పుని నానబెట్టి పాలు తీయడం కూడా చాలా సులువు. వీటినుంచి తగినన్ని మాంసకృత్తులూ, యాంటీ ఆక్సిడెంట్‌లూ, విటమిన్‌-ఇ, ఇనుము, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ల వంటివెన్నో అందుతాయి. శరీరంలో వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.