మిథునం
మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. కొత్త యత్నాలు చేపడతారు. ఆదాయానికి తగ్గట్లుగా లెక్కలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. చిట్స్, ఫైనాన్స్ సంస్థల జోలికి పోవద్దు. ముఖ్యమైన పత్రాలు స్వయంగా చూసుకోండి. శుభలేఖ అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. సన్నిహితులతో గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు. ఫ్యాన్సీ, జనరల్ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను తట్టుకుంటారు. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి.