1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
  4. dr raman astrology

11 వ సంవత్సరము వరకూ ఆరోగ్యములో జాగ్రత్త అవసరం(పి. హర్షవర్థన్-కదిరి)

dr raman astrology
పి. హర్షవర్థన్-కదిరి: మీరు అమావాస్య శుక్రవారం, కర్కాటక లగ్నము, ఆశ్రేష నక్షత్రం, కర్కాటక రాశి నందు జన్మించారు. లగ్నము నందు రవి, శుక్ర, చంద్ర, కుజులు ఉండటం వల్ల అప్పుడప్పుడు ఆరోగ్యములో చికాకులు తలెత్తినా సమసిపోతాయి. మీ 11 వ సంవత్సరము వరకూ ఆరోగ్యములో జాగ్రత్త అవసరం. ప్రతి మాస శివరాత్రికి ఈశ్వరునికి అభిషేకం చేయించి తీర్థం తీసుకున్నా శుభం కలుగుతుంది. మీరు సీఏ వంటి చదువుల్లో ఏకాగ్రత వహించినా రాణిస్తారు. ప్రతిరోజూ  ఆరోగ్య గణపతిని ఆరాధించినా సర్వదా శుభం కలుగుతుంది. మీ 24 లేక 25 సంవత్సరము నందు బాగుగా స్థిరపడతారు. ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది.
 
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
About Writer
Raman