Astrology Yearly Horoscope Details

Notifications

మేషం మేషం
మేషరాశి : అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము ఆదాయం - 11 వ్యయం - 5 రాజపూజ్యం -2 అవమానం - 4 ఈ రాశివారి గోచారమును పరిశీలించగా కార్యసాధనకు నిరంతరం శ్రమిస్తుంటారు. అనుకున్న ఫలితం నిదానంగా సాధ్యమవుతుంది. అనుక్షణం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఫలితాలు కూడా తగ్గట్టుగానే ఉంటాయి. ఆదాయం బాగున్నా వెలితిగా ఉంటుంది. ఖర్చులు అధికం. అయినా కొంత మొత్తం పొదుపు చేయగలుగుతారు. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవటం అంత శ్రేయస్కరం కాదు. ఆత్మీయులతో తరచుగా కాలక్షేపం చేస్తారు. గృహంలో శుభకార్యాలు జరుపుతారు. బంధుత్వాలు, పరిచయాలు, అధికమవుతాయి. దంపతుల మధ్య చీటికిమాటికి కలహం. గృహప్రశాంతతకు భంగం కలిగే సూననలు కనిపిస్తున్నాయి. సంతానం వల్ల కూడా మనశ్శాంతి ఉండదు. సంస్థలు, ప్రాజెక్టుల స్థాపనలపై దృష్టి పెడతారు. మీ ఉన్నతి బంధువర్గాలకు అపోహ కలిగిస్తుంది. చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా ధైర్యంగా మెలుగుతారు. అవివాహితులకు శుభయోగం. ఆశించిన సంబంధం నిశ్చయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. అనుక్షణం అధికారుల తీరుకు అనుగుణంగా మెలగండి. త్వరలో స్థానచలనంతో కూడిన పదోన్నతి లభించగలదు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేయు ఉద్యోగస్తులకు ఓర్పు, అంకితభావం ప్రధానం. వీరికి ఈ సంవత్సరాంతంలో ప్రోత్సాహకరమైన అవకాశాలు లభిస్తాయి. వృత్తి పరంగా వైద్య, న్యాయ, ఉపాధ్యాయులకు, సాంకేతిక రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. న్యాయపరమైన అంశాల్లో కొన్ని ఇబ్బందులెదురైనా సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పంట దిగుబడి బాగున్నా మద్దతు ధర విషయంలో అసంతృప్తిగా ఉంటుంది. మొదటి పంట కంటే రెండవ పంట ఆశాజనకం. సాధించిన దిగుబడికి మార్కెట్ రంగంలో మంచి ధర లభిస్తుంది. వ్యాపారులు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లు, నష్టాలను దీటుగా ఎదుర్కుంటారు. ఉమ్మడి వ్యాపారాల కంటే సొంతంగా చేయటమే శ్రేయస్కరం. చిన్నచిన్న వ్యాపారాలు బాగుంటాయి. వారికి నూతన పెట్టుడులు కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. విద్యార్థులకు లక్ష్యం పట్ల పట్టుదల, ఏకాగ్రత ముఖ్యం. ర్యాంకు సాధనకు ఓర్పుతో శ్రమించండి. మీ కృషి తప్పక ఫలిస్తుంది. విద్యార్థులు ముఖ్యంగా అత్యుత్సాహలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. మీ భవిష్యత్తు దెబ్బతినకుండా మెలగండి. ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు స్వల్ప రుగ్మతలకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోకుండా వైద్యసలహాలు పాటించటం శ్రేయస్కరం. తరచు శుభకార్యాల్లో పాల్గొనటం, వస్త్రప్రాప్తి, వస్తులాభం, వాహనసౌఖ్యాలతో ఈ రాశివారు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు పొందుతారు.

స్పీకర్‌ను కులం పేరుతో దూషించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ - కటకటాల వెనక్కి పంపిన పోలీసులు...

ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభం : పవన్ కళ్యాణ్

ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభం : పవన్ కళ్యాణ్పిఠాపురం నియోజక వర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతవాసుల దశాబ్దాల కల సాకారం దిశగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం దిశగా కీలక అడుగులు ప్రారంభమయ్యాయి. రక్షణ గోడ నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించేందుకు ఒప్పందం చేసుకున్న ఐఐటీ - మద్రాస్ పనిని ప్రారంభించింది. రూ.323 కోట్లనేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్‌తో నిర్మితమవుతున్న ఈ రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి డిజైన్, డీపీఆర్ రూపకల్పన కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఐఐటీ మద్రాస్ ప్రతినిధి బృందం అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో సముద్ర గర్భంలోనూ, తీర ప్రాంతం వెంబడి సర్వే చేపట్టింది.

ఇబ్బందుల్లో చిత్తూరు మామిడి రైతులు.. బకాయిల కోసం ఎదురుచూపులు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు-2026.. టీటీడీ సిబ్బంది వివరాల తనిఖీ.. క్రిమినల్ కేసులు ఉన్నాయేమో?

06-09-2026 నుంచి 12-09-2026 వరకు వార ఫలితాలు - ఆశించిన ధనం అందుతుంది

06-09-2026 నుంచి 12-09-2026 వరకు వార ఫలితాలు -  ఆశించిన ధనం అందుతుందిమేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం మీదైన రంగంలో పురోగమిస్తారు. ఆశించిన ధనం అందుతుంది. ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి. లావాదేవీల్లో సరైన నిర్ణయం తీసుకుంటారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. మీ జోక్యం వల్ల ఇరువర్గాలకు ప్రయోజనం కలుగుతుంది. ఇరువైపులా సముచిత సలహాలు ఇస్తారు. గురువారం నాడు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. అపరిచిత వ్యక్తులు మోసగించే అవకాశం ఉంది. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోండి. మీ శ్రీమతి వద్ద నుండి శుభవార్తలు, సంతానానికి శుభఫలితాలు ఉన్నాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులకు సన్నిహితులు అవుతారు. బాధ్యతల స్వీకరణకు అనుకూలం. ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నాలు కొనసాగించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు, ప్రణాళికలు మున్ముందు సత్ఫలితాలనిస్తాయి. దైవకార్యంలో పాల్గొంటారు.