1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Vidadala Rajini Falls During Scuffle with Police

మహిళా పోలీస్‌తో తోపులాట : కిందపడిన మాజీ మంత్రి విడదల రజని (వీడియో)

vidadala rajini
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైకాపా నేత విడదల రజని, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్, మాజీ మంత్రి రజని మధ్య జరిగిన తోపులాటలో విడదల రజని కిందపడ్డారు. 
 
ఎడ్లపాడు జడ్పీటీసీ అభ్యర్థి బుల్లబ్బాయి, విడదల రజని కలిసేందుకు ఆమె నివాసానికి వచ్చారు. అయితే, ఇంటి గేటు వద్ద ఉన్న పోలీసులు బుల్లబ్బాయిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రజని బయటకు వచ్చి తమ మద్దతుదారుడిని ఇంట్లోకి ఎందుకు అనుమతించడం లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 
 
ఈ సందర్భంగా చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ ప్రియాంక, విడదల రజనీకి మధ్య వాగ్వాదం జరిగింది. తన మద్దతుదారుడి నామినేషన్‌కు సంబంధించిన బీ-ఫామ్ తన ఉందని, మూడు రోజులుగా తమ వారిని ఇలానే ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఎస్ఐ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగి విడదల రజని కిందపడిపోయారు. 
 
దీంతో విడదల రజని మహిళా పోలీస్ అధికారిణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చిపట్టిందా నీకు?.. నన్ను చంపుతావా నువ్వు? ఏం మెటలా నీకు? ఎవడు పంపాడు నిన్ను ఇక్కడకి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో రజని నివాసం వద్ద కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత తన మద్దతుదారులతో కలిసి ఆమె ఇంటివద్దే నిరసనకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా వైరల్ అయింది. 

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నల్లచెరువు జడ్పీటీసీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్