ఆదివారం, 8 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 ఫిబ్రవరి 2026 (14:24 IST)

మాజీ మంత్రి విడదల రజనీతో పాటు 21 మంది వైకాపా నేతలపై కేసు

vidadala rajini
వైకాపా నేత, మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదైంది. గత నెల 30న విడదల రజని అనుచరులు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ నేతల ఫిర్యాదుతో యడ్లపాడు పోలీసులు.. రజనితోపాటు 21 మంది వైకాపా నేతలపై కేసు నమోదు చేశారు. మరోవైపు వినుకొండ పీఎస్‌లో వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు నమోదైంది. 
 
గత నెల 31న స్థానిక వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బొల్లా, వైకాపా నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన తోపులాటలో ఓ కానిస్టేబుల్‌ను వైకాపా నేతలు నెట్టివేశారు. దీంతో అతడికి గాయాలయ్యాయి. కానిస్టేబుల్‌ ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యేతో పాటు 27 మంది నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
వివాహం కాలేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య 
 
హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి పెళ్లి కాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మేడ్చల్ జిల్లా కండ్లకోయకు చెందిన తోప్నివాల్ విజయలక్ష్మి (26)కి తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. 
 
తల్లి సరస్వతికి మతిస్థిమితం సరిగా లేదు. ప్రస్తుతం కూకట్పల్లి పరిధి మైత్రినగరులో ఉంటున్నారు. తల్లికి అన్నీ తానై సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఐటీ సంస్థలో ఉద్యోగంచేస్తున్న ఆమెకు ఇటీవల వివాహసంబంధాలు వచ్చాయి. తల్లి తనతోపాటే ఉంటుందని నిబంధన పెట్టడంతో కుదరలేదు.
 
దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురై శనివారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె సమీప బంధువు అభిషేక్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేశారు. హుసేన్ సాగర్‌లో యువతి మృతదేహం సోమవారం తేలడంతో లేక పోలీసులు విషయాన్ని కూకట్‌పల్లి పోలీసులకు తెలపగా వారు ఆ మృతదేహం కూకట్ పల్లిలో అదృశ్యమైన విజయలక్ష్మిదేనని నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.