గురువారం, 24 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 ఏప్రియల్ 2025 (09:37 IST)

మాజీ మంత్రి విడుదల రజిని మరిది గోపి అరెస్టు

vidadala rajini
వైకాపా మహిళా నేత, ఏపీ మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపిని అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం రాత్రి హైదరాబాద్ నగరంలో అదుపులోకి తీసుకుని, విజయవాడకు తరలిస్తున్నారు. యడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారని గోపితో పాటు విడుదల రజినిపై కేసు నమోదైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏసీబీ అధికారులు గోపిని అరెస్టు చేశారు. 
 
పల్నాడు జిల్లా యడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ అధికారులు మాజీ మంత్రి విడదల రజిని, గోపి, అప్పటి విజిలెన్స్ అధికారి జాషువా, రజిని పీఏ రామకృష్ణలపై కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. 
 
కాగా, ఏపీసీబీ కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కోసం విడుదల రజినీ, గోపి హైకోర్టును ఆశ్రయించారు. విజిలెన్స్ అధికారి జాషువా క్వాష్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు రిజర్వులో పెట్టింది. కాగా, స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.కోట్లు వసూలు చేశారనే ఆరోపణలతో ఏసీబీ నమోదు చేసిన విషయం తెల్సిందే.