cyclone alert, కాకినాడ తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్
కోస్తాంధ్రకు తుఫాన్ ముప్పు పొంచి వున్నది. అక్టోబరు 27 నాటికి తుఫానుగా మారి అక్టోబరు 28కి పెను తుఫానుగా కాకినాడ సముద్ర తీరాన్ని తాకే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు-మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది.
ఈ అల్పపీడనం సోమవారం ఉదయానికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారి, తదుపరి రెండు రోజుల్లో ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు, రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
CYCLONE ALERT: COASTAL ANDHRA PRADESH Oct 26: Likely to intensify into a Cyclonic Storm over the Bay of Bengal Oct 27: Likely to strengthen into a Severe Cyclonic Storm Oct 28: Chance of becoming a Very Severe Cyclonic Storm and landfall over #Kakinada coast https://t.co/TgMooDqhR2
— tirupati weatherman (@TPTweatherman) October 23, 2026

