Astrology Yearly Horoscope Details

Notifications

కుంభం కుంభం
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1 2 3 4 పాదములు, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు ఆదాయం - 2 వ్యయం 8 - రాజపూజ్యం - 4 అవమానం - 2 ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవహారజయం, అన్నివిధాలా అనుకూలతలున్నాయి. ఏ పని తలపెట్టినా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. గృహంలో అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ప్రతి విషయంలోను ధైర్యంగా ముందుకు పోగలరు. పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగా అనుకూలిస్తాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మీపై బంధుమిత్రులకు ప్రత్యేకాభిమానం కలుగుతుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. తరచుగా వేడుకలు, విందులకు హాజరవుతుంటారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు నియంత్రించుకుంటారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. సొంత గృహం ఏర్పచుకోవాలన్న వాంఛ నెరవేరుతుంది. శుభకార్యాలకు సన్నాహాలు సాగిస్తారు. ముఖ్యమైన లావాదేవీలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఉభయత్రా అమోదయోగ్యమవుతుంది. సంతానం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వారి వల్ల సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. పెద్దల జోక్యంతో వివాదాలు పరిష్కారమవుతాయి. మీ గౌరవ ప్రతిష్టలకు ఏమాత్రం భంగం కలుగదు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు యోగదాయకం. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు, ప్రముఖులను ఆకట్టుకోగలుగుతారు. వీరికి దూరప్రాంతానికి స్థానచలనం, పదోన్నతి, నగదు బహుమతి వంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి. బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. సహోద్యోగులతో చిన్న చిన్న సమస్యలెదురైనా వెంటనే సమసిపోగలవు. విద్యార్థులకు ఏకాగ్రత, లక్ష్యసాధనకు మరింత కృషి ముఖ్యం. పట్టుదలతో చదివి మంచి ర్యాంకులు పొందగల్గుతారు. వీరికి ఇంజనీరింగ్, మెడికల్, లా, సాంకేతిక కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. వీరు అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవటం వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. వ్యవసాయ తోటల రంగాల వారికి అన్ని విధాలా బాగుంటుంది. అధిక పంట దిగుబడులు సాధించటంతో పాటు గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది. వరి, చెరకు, పత్తి, అరటి, పూల, కూరగాయల రైతులకు ఆశాజనకం. దళారుల మాటలు నమ్మి మోసపోకండి. పంటకు మంచి ధర లభించే వరకు వేచియుండండి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వీరికి ప్రభుత్వపరంగా అన్ని విధాలా సాయం అందుతుంది. బ్యాంకు, ఫైనాన్సు రంగాల్లో రుణలు అతికష్టంమ్మీద లభిస్తాయి. కళాకారులకు ప్రథమార్ధం వరకు బాగున్నా ఆ తరువాత నిరాశాజనకం. అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి. మీలోని ప్రతిభకు ఏమాత్రం గుర్తింపు ఉండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ సంవత్సరం శుభకాలం. చేపట్టిన నిర్మాణాలు అనుకున్న సమయంలో పూర్తికావటం, ఫ్లాట్లు త్వరితగతిన అమ్ముడు పోవటం వంటి ఫలితాలున్నాయి. అయితే ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో మాత్రం ఇబ్బందులు తప్పవు. రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అంతా కలిసివస్తుంది. మీ పేరిట ఆస్తులు సమకూరుతాయి. సంతానసౌఖ్యం, గృహంలో ప్రశాంతత పొందుతారు.. కళాత్మక పోటీల్లో విజయం సాధిస్తారు. గృహంలో సైతం వీరి మాట చెల్లుబాటవుతుంది. తరచుగా వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. నగదు, వెండి బంగారాలు చోరీకి గురయ్యే ఆస్కారం ఉంది. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం యోగదాయకంగానే ఉంటుంది.

అసభ్యకరం, ఇంతకన్నా రాహుల్ గాంధీ నుంచి ఏమి ఆశించగలం?: నటి ఖుష్బూ

అసభ్యకరం, ఇంతకన్నా రాహుల్ గాంధీ నుంచి ఏమి ఆశించగలం?: నటి ఖుష్బూకాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నుంచి ఇంతకంటే మనం ఏమి ఆశించగలం అంటూ భాజపా నాయకురాలు, నటి ఖుష్బూ అన్నారు. ఆమె ఎక్స్ వేదికగా పేర్కొంటూ... రాహుల్ గాంధీ అసభ్యకరమైన వాక్చాతుర్యం నన్ను ఆశ్చర్యపరచదు. దీనికి భిన్నంగా ఆశించడం మన అవివేకం అవుతుంది. ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న నాయకుడైన ప్రధానమంత్రి నరేంద్రమోదీజీతో సమానుడు కానే కాదు, కనీసం అణువంత కూడా సమానత్వం కలిగి లేడు. ప్రధానమంత్రిపై అతని ద్వేషం విషపూరితమైనది. అంతే అసహ్యకరమైన మరొక వ్యక్తి, వేరొక మహిళ గురించి చేసిన నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యను ఆయన ఖండించకుండా నవ్వినప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

20 ఏళ్ల యువకుడితో అఫైర్.. భర్తకు నిద్రమాత్రలు.. అక్కడ కరెంట్ షాకిచ్చి..?

20 ఏళ్ల యువకుడితో అఫైర్.. భర్తకు నిద్రమాత్రలు.. అక్కడ కరెంట్ షాకిచ్చి..?భర్తను హత్య చేస్తున్న భార్యల సంఖ్య పెరిగిపోతుంది. వివాహేతర సంబంధాలు నేరాల సంఖ్యను పెంచేస్తుంది. తాజాగా ఢిల్లీలో ఖర్చులకు భర్త డబ్బులు ఇవ్వడం లేదన్న కక్షతో 55 ఏళ్ల భర్తను మట్టుబెట్టాలని పథకం వేసింది ఓ భార్య. అలాగే 45 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. ఈ సంబంధానికి అడ్డున్న భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. అంతే రాత్రి వేళ భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ తప్పేలా చేసింది. ఆ తర్వాత ప్రియుడిని ఇంటికి పిలిపించి, అత్యంత క్రూరంగా భర్త ప్రైవేట్ పార్ట్‌కు కరెంట్ షాక్ ఇచ్చి ప్రాణాలు తీసింది. ఆపై ఇంట్లో దొంగలు పడి భర్తను చంపారని డ్రామా చేసింది.

14-08-2026 శుక్రవారం మీ రాశి ఫలితాలు- ఏ విషయానికీ కుంగిపోవద్దు...

సమస్యలు.. వెలిగించాల్సిన దీపాలు.. అల్లం దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే?

శ్రావణ మాసం... శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం.. భక్తులకు నైతిక బలం..

శ్రావణ మాసం... శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం.. భక్తులకు నైతిక బలం..శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణం పేరుమీద వచ్చిన మాసం కావడంతో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. అందుకే దీనిని శ్రావణ మాసం అని పిలుస్తారు. శ్రీకృష్ణ భగవానుడు పుట్టినది, హయగ్రీవోత్పత్తి జరిగింది, గరుడుడు అమృతభాండాన్ని సాధించింది శ్రావణ మాసంలోనే. గురుకులాల్లో విద్యార్థులు వేదపాఠం మొదలయ్యే ముందు చేపట్టే సంవిధానాన్ని శ్రావణి అని కూడా అంటారు. శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీమహాలక్ష్మీ దేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ, వారిని కార్యోన్ముఖుల్ని చేసే శక్తియుక్తుల్ని అందిస్తుందని నమ్మకం. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది.

13-08-22026 ఫలితాలు - రోజులు భారంగా గడుస్తున్నట్టు అనిపిస్తాయి