1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
  4. Weekly horoscope for from October 25-10-2026 to 31-10-2026

25-10-2026 నుంచి 31-10-2026 వరకు మీ వారఫలాలు - ఎవరినీ తప్పుపట్టవద్దు

Weekly horoscope
Weekly horoscope
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషం కలిగిస్తుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. అందరితోనూ మితంగా మాట్లాడండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. బుధవారం నాడు ఒక సంఘటన ఆలోచింపజేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. ఒంటెద్దు పోకడ తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. పంచాలు, బెట్టింగుల జోలికి పోవద్దు.
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. హామీని నిలబెట్టుకుంటారు. బంధువులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. పనులు వేగవంతమవుతాయి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. శనివారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, వృత్తుల వారికి బాగుంటుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ దీక్షలు స్వీకరిస్తారు.
 
మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కార్యదీక్షే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయం అంతంత మాత్రమే. ఆకస్మిక ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. సోమవారం నాడు నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. దూరపు బంధువుల శుభలేఖ అందుకుంటారు. భార్యాభర్తల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. చిరు వ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. వేడుకకు హాజరవుతారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉంటారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. ప్రణాళికాబద్ధంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం. ఆదివారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. కొందరి వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులతో తీరిక ఉండదు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. నిపుణులను సంప్రదించండి. బుధవారం నాడు ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా జరుగుతాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఎవరినీ తప్పుపట్టవద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. అవతలి వారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అంత సంతృప్తినీయవు. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
లక్ష్యానికి చేరువలో ఉన్నారు, పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. పనులు చురుగ్గా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. గురువారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యం కాదు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మొండిధైర్యంతో అడుగు ముందుకేస్తారు. మీ శ్రీమతి నుంచి ప్రోత్సాహం ఉంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉపాధ్యాయులకు పదవీ యోగం. అధికారుల మన్ననలు అందుకుంటారు. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి. భవన నిర్మాణాలు ఊపందుకుంటాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఆశాజనకం.
 
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. నూతన పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. మంగళవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. భార్యాభర్తలు అవగాహనకు రాగలరు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. పెద్ద మొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదాలు
ఈ వారం కలిసివచ్చే సమయం. కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పనులు వేగవంతమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. శుభలేఖ అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను తట్టుకుంటారు. చిరు వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
ధనుస్సు: మూల, పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం
అన్ని విధాలా అనుకూలమే. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు ప్రయోజనకరం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. అనవసర విషయాల జోలికి పోవద్దు, లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ చొరవతో వివాహ సంబంధం నిశ్చయమవుతుంది. స్నేహ సంబంధాలు బలపడతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పత్రాల్లో మార్పులు సాధ్యపడవు. మరోసారి యత్నించండి. నేడు అనుకూలించనిది రేపు సాధ్యమవుతుంది. ఉపాధి పథకాలు చేపడతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. శుభకార్యానికి హాజరవుతారు.
 
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు విపరీతం. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. బుధవారం నాడు ఇతరుల విషయాలకు దూరంగా ఉండండి. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పదవీ యోగం, పురస్కారాలు అందుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు.
 
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఆపన్నులను ఆదుకుంటారు. శుక్రవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహ యత్నం ఫలించే సూచనలున్నాయి. అవతలి వారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపడి మాట ఇవ్వవద్దు. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. సోమవారం నాడు ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. మీ నుంచి విషయ సేకరణకు కొందరు యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. భార్యాభర్తలు ఏకాభిప్రాయానికి రాగలరు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. కొద్దిగా శ్రమిస్తే మంచి ఫలితాలుంటాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
కలలో ఏమైనా తింటున్నట్లు చూస్తే.. పండ్ల రసం తాగినట్లు కలగంటే?