1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
  4. Weekly horoscope for from October 11-10-2026 to 17-10-2026

11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?

Weekly horoscope
Weekly horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త యత్నాలు చేపడతారు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తేవద్దు. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. విందులు, వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఫలితం అంతంత మాత్రమే. మీ కష్టం వేరొకరికి లాభిస్తుంది. చిన్న విషయానికే చికాకుపడతారు. గురువారం నాడు చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. మీపై శకునాల ప్రభావం అధికం. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యం కాదు. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు, ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పత్రాల్లో సవరణలు అనివార్యం. ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వాహనదారులకు దూకుడు తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగానే ఉంది. సంప్రదింపులు ఫలిస్తాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్తపనులు చేపడతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ కించపరచవద్దు. శనివారం నాడు కొత్త సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. దంపతుల మధ్య అవగాహన లోపం, చీటికిమాటికి చికాకుపడుతుంటారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. ఉపాధి పధకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, విశ్రాంతి లోపం. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీదైన రంగంలో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ముఖ్యమైన చెల్లింపుల్లో జాప్యం తగదు. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. బుధవారం నాడు ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంభాషిస్తారు. అవతలి వారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలకు అనుకూలం.
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకున్న కార్యం నెరవేరుతుంది. వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. శుక్రవారం నాడు పనులు, కార్యక్రమాలు స్వయంగా చూసుకోండి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చిన్న విషయానికే చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. దైవదర్శనాల్లో అవస్థలెదుర్కుంటారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీదైన రంగంలో రాణింపు, అనుభవం గడిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆదివారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. కార్యసాధనకు ఓర్పుతో మెలగండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. ఆశావహదృక్పధంతో మరోసారి యత్నించండి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు కొత్త సమస్య ఎదురవుతుంది. సరుకు నిల్వలో జాగ్రత్త వహించండి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.
ఈ వారం అన్ని విధాలా బాగుంటుంది. కార్యదీక్షతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. ప్రముఖులను ఆకట్టుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరుగుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. అనవసర విషయాల జోలికి పోవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఆటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. సాఫ్ట్వేర్ విద్యార్థులకు సదవకాశం లభిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. సమర్థతను చాటుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. వాయిదా పడుతున్న పనులు పూర్తిచేస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఆప్తల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పొగడ్తలకు లొంగవద్దు. మీ చొరవతో వివాహసంబంధం నిశ్చయమవుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతికూలతలను అధిగమిస్తారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో మీ కృషి ఫలించి మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. బుధవారం నాడు. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆహ్వానం, కీలక పత్రాలు అందుతాయి. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగబాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యానికి చేరువవుతారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. శనివారం నాడు పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది. కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, అధికారులకు హోదామార్పు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. శుభకార్యానికి హాజరవుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారపరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. మీ కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. మొండిధైర్యంతో అడుగు ముందుకేస్తారు. మంగళవారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. శుభలేఖ అందుకుంటారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వాహనం అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. నూతన వ్యాపారాలు ప్రస్తుతం తగవు, ఉపాధ్యాయు, ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. ఆరోగ్యం జాగ్రత్త. దైవదర్శనాలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురైనా ఎట్టకేలకు పూర్తవుతాయి. సోమవారం నాడు ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. గృహమార్పు కలిసివస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ప్రత్యర్ధులతో జాగ్రత్త. మిమ్ములను తప్పుదోవ పట్టించేందుకు కొందరు యత్నిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు, అంకితభావం ముఖ్యం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. మీ పథకాలు, ప్రణాళికాలు ఆశించిన ఫలితాలిస్తాయి.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
Sabarimala: శబరిమల యాత్రికుల కోసం QR కోడ్‌లు, సమాచార కేంద్రాల ఏర్పాటు