18-10-2026 నుంచి 24-10-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య చీటికీ మాటికీ కలహం
Weekly horoscope
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. చాకచక్యంగా మెలుగుతారు. ఆలోచనలు క్రియారూపం దాలుస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం సద్వినియోగం చేసుకోండి. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ముఖ్యమైన చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కీలక పత్రాలు అందుకుంటారు.
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. నిపుణుల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. సోమవారం నాడు పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. శుభలేఖ అందుకుంటారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. ముఖ్యుల ఇంటర్వ్యూ వీలుపడదు. మొండిధైర్యంతో వ్యవహరిస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. సంతానానికి శుభపరిణామాలున్నాయి. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. ఉద్యోగస్తులకు పని భారం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పెట్టుబడులకు తరుణం కాదు. విందులు, వేడుకలకు హాజరవుతారు.
మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ముఖ్యమైన పనులు స్వయంగా చూసుకోండి. ఆదివారం నాడు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య చీటికీ మాటికీ కలహం. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. మీ తప్పిదాలు సరిదిద్దుకోవడం శ్రేయస్కరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. చిన్న విషయానికే చికాకుపడతారు. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారించండి. ఆరోగ్యం జాగ్రత్త. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. అవతలి వారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. వాహనం ఇతరులకివ్వవద్దు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని రంగాల వారికీ బాగుంటుంది. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ప్రముఖులకు చేరువవుతారు. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. గురువారం నాడు అందరితోనూ మితంగా మాట్లాడండి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణుగుతుంది. కుటుంబీకుల గురించి ఆందోళన చెందుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉపాధ్యాయులకు పదవీ యోగం. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. నూతన పెట్టుబడులకు అనుకూలం. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యానికి చేరువవుతారు. కార్యదీక్షతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. అర్ధాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. శనివారం నాడు అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. నోటీసులు అందుతాయి. నిపుణుల సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయం తగదు. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. ఆప్తుల రాక సంతోషం కలిగిస్తుంది. పెట్టుబడులకు తగిన సమయం. సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. రావలసిన ధనం అందుతుంది. అనుకున్న ఖర్చులే ఉంటాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. మంగళవారం నాడు నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. తరచు సన్నిహితులతో సంభాషిస్తారు. దూరపు బంధువుల శుభలేఖ ఆశ్చర్యం కలిగిస్తుంది. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ముఖ్యులను కలుసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. సంతానం దూకుడు వివాదాస్పదమవుతుంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. బెట్టింగుల జోలికి పోవద్దు.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఈ వారం యోగదాయకం. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. చిట్స్, ఫైనాన్సుల జోలికి పోవద్దు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. నూతన దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. ప్రకటనలు, ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. కొత్త వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. గృహ మరమ్మతులు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను తట్టుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య స్వల్ప కలహం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను నమ్మవద్దు. చెల్లింపుల్లో జాగ్రత్త. ఉపాధ్యాయులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. శుభకార్యాల్లో అత్యుత్సాహం తగదు.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం
కార్యసాధనకు నిర్విరామంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సన్నిహితులతో తరచు సంభాషిస్తుంటారు. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు, పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపులను అశ్రద్ధ చేయకండి. శుక్రవారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వివాహ యత్నం ఫలించే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్త.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. స్థిమితంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రాగలరు. స్థిరాస్తి ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభలేఖ అందుకుంటారు. ఆదివారం నాడు ఏ పనీ చేయబుద్ధి కాదు. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెద్దలను కలుసుకుంటారు. పోగొట్టుకున్న నగదును చేజిక్కించుకుంటారు. సంతానానికి మంచి ఫలితాలున్నాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. ఉద్యోగస్తులకు పదవీ యోగం, ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు. రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. చాకచక్యంగా అడుగు ముందుకేస్తారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. కొత్త పనులు చేపడతారు. ప్రముఖులతో సంభాషిస్తారు. మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. ఖర్చులు విపరీతం. కొన్ని అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో అలసత్వం తగదు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. బాధ్యతలు అప్పగించవద్దు. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగ విధుల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. చిన్న వ్యాపారాలు ఊపందుకుంటాయి. కీలక పత్రాలు అందుకుంటారు.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. మీ నమ్మకం వమ్ముకాదు, కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. శనివారం నాడు మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహ మార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. బంధుమిత్రులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా కొట్టివేయొద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సన్నిహితులతో తరచు సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ విధుల్లో మార్పులుంటాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

