Astrology Yearly Horoscope Details

Notifications

వృషభం వృషభం
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1 2 3 4 పాదములు, మృగశిర 1, 2, పాదములు ఆదాయం- 5 వ్యయం- 14 అవమానం -5 రాజపూజ్యం- 4 వృషభరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా శుభదాయకం. ఆత్మీయులు, సన్నిహితులతో నిత్యం ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. సంఘంలో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. గృహనిర్మాణాలు, కొనుగోలుపై దృష్టి సారిస్తారు. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. తరచు వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించండి. ఆహార నియయాలు, ఔషధసేవనంలను క్రమం తప్పకుంటా పాటించండి. ధార్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. తరచు ఆలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. మీ కృషి ఆలస్యంగానైనా మంచి ఫలితం ఇస్తుంది. ముఖ్యమైన పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. సంస్థల స్థాపనలకు అనుకూల సమయం. ఉద్యోగ బాధ్యతలపై దృష్టిపెట్టండి. ధనప్రలోభాలకు గురికావద్దు. కిట్టని వ్యక్తులు మిమ్ములను ఇరకాటానికి గురిచేస్తారు. ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన స్థానచలనం. రిటైర్డు అధికారులకు రావలసిన బెనిఫిట్స్ ఆలస్యంగా లభిస్తాయి. ఆశావహదృక్పధంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. మీ యత్నం తప్పకుండా ఫలిస్తుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులు లాభాలు గడిస్తారు. భాగస్వామిక ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. చేనేత, నూలు, పట్టు వస్త్రవ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. న్యాయవాదుల ఆదాయం బాగుంటుంది. చేపట్టిన అన్ని కేసులలోను విజయం సాధిస్తారు. టెక్నికల్ రంగాల వారికి నిరాశాజనకం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. ర్యాగింగ్ వంటి దుశ్చర్యలకు పాల్పడవద్దు. విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి బాగుంటుంది. దాళ్వా కంటె సార్వాలో అధిక దిగుబడులు సాధిస్తారు. మిర్చి, కంది, మినుము, ఉల్లి, కూరగాయల పంట దిగుబడులు బాగుంటాయి. మద్దతు ధర ఏమంత సంతృప్తినీయజాలదు. మార్కెట్ రంగాల వారు ఆశించిన లాభాలు గడిస్తారు. కళాకారులకు సదవకాశాలు లభిస్తాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వాహనం అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. దంపతుల మధ్య తరచు కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోగలవు. సంతానం దూకుడు అదుపు చేయటం శ్రేయస్కరం. తరచు విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్తపరిచయాలు, బంధుత్వాలేర్పడతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు తగదు.

నాసిక్ పండరీపురంలో విషాదం, రక్షణ గోడ లేని బావిలోకి దూసుకెళ్లిన వాహనం, 8 మంది మృతి, వీడియో

నాసిక్ పండరీపురంలో విషాదం, రక్షణ గోడ లేని బావిలోకి దూసుకెళ్లిన వాహనం, 8 మంది మృతి, వీడియోమహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని పండరీపురంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. అక్కడి దృశ్యాలు అత్యంత హృదయవిదారకంగా కనబడుతున్నాయి. బావి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు చిన్నారులను బైటకు తీస్తుండగా స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రక్షణ లేని బావిలో పికప్ వాహనం పడిపోవడంతో 8 మంది భక్తులు మృతి చెందారని వారు చెబుతున్నారు. పండరిపురం సమీపంలో ఒకే గ్రామానికి చెందిన ఎనిమిది మంది యాత్రికులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి వాహనం అదుపుతప్పి, ఎలాంటి రక్షణ గోడ లేని లోతైన బావిలో పడిపోయింది. ఆలయంలో ప్రార్థనలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ సక్సెస్

ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ సక్సెస్భారత రక్షణ సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేస్తూ, రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సోమవారం నాడు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ విజయవంతమైన ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ ప్రయోగం ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి జరిగింది. చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ఏర్పాటు చేసిన వివిధ ట్రాకింగ్ పరికరాలు సేకరించిన డేటా ప్రకారం, పరీక్ష లక్ష్యాలన్నీ పూర్తిగా నెరవేరాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్డీ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్షిపణి అన్ని మిషన్ లక్ష్యాలను సాధించి, కీలక సాంకేతికతలను ధృవీకరించడంతో పాటు, భారతదేశం పెరుగుతున్న సుదూర ఖచ్చితమైన దాడి సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో బంగారు గొలుసులు లాక్కున్న దుండగులు

14-06-2016 ఆదివారం ఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త..

14-06-2026 నుంచి 20-06-2026 వరకు వార ఫలితాలు

14-06-2026 నుంచి 20-06-2026 వరకు వార ఫలితాలుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ వారం కొంతమేరకు అనుకూలం. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు పథకాల పట్ల దృష్టి సారిస్తారు. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. అలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో సవరణలు సానుకూలమవుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు తగిన సమయం కాదు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం, అధికారులకు వీడ్కోలు పలుకుతారు.