Astrology Zodiac Cancer Chr.htm

Notifications

కర్కాటకం కర్కాటకం
గుణగణాలు

ఈ రాశివారు ఎప్పుడూ అభద్రతాభావంతో ఉంటారు.వీరికి ఏ విషయంపై ఆసక్తి అనేది ఉండదు. వీరి మానసిక అభిప్రాయాలకు విలువ లేకుండా పోవడం జరుగతుంది. ఇతరులతో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై విభేధిస్తూ ఉంటారు. సమాజం కోసం ఎప్పుడూ ఏదో చేయాలనే ఆసక్తి వీరికి మనసులో ఉంటుంది.

ఇంట్లో నల్లటి గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ వాడటం మంచిది కాదా?

krishna Jayanti 2026 worship: శ్రీ కృష్ణుని జయంతి రోజున ఈ ఐదు విషయాలు పాటిస్తే...?

krishna Jayanti 2026 worship: శ్రీ కృష్ణుని జయంతి రోజున ఈ ఐదు విషయాలు పాటిస్తే...?శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన రోజును మనం ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి (కృష్ణ జయంతి)గా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం, శ్రావణ మాసంలో బహుళ పక్ష అష్టమి, రోహిణి నక్షత్రం కలిసిన రాత్రి వేళలో, మధురలోని చెరసాలలో భగవంతుడైన శ్రీకృష్ణుడు అవతరించాడని చెప్పబడింది. అందువల్ల, ఈ మాసంలో వచ్చే కృష్ణ పక్ష అష్టమి రోజున సాయంత్రం వేళలో కృష్ణాష్టమి పూజలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 04, శుక్రవారం నాడు కృష్ణాష్టమి జరుపుకోనున్నారు. ఈ రోజున సాయంత్రం 6 గంటల తర్వాత శ్రీకృష్ణుడిని పూజించాలి. ప్రత్యేకించి, నిశిత కాల పూజ సమయమైన రాత్రి 11:57 నుండి అర్ధరాత్రి దాటాక 12:43 వరకు ఉన్న సమయంలో శ్రీకృష్ణుడిని ఆరాధించడం చాలా విశేషమైనది.

01-09-2026 మంగళవారం రాశి ఫలితాలు... ఇతరుల మాటలను నమ్మి తొందరపడి..?

01-09-2026 మంగళవారం రాశి ఫలితాలు... ఇతరుల మాటలను నమ్మి తొందరపడి..?మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీరు చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. అయితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పరిస్థితులను పూర్తిగా పరిశీలించడం అవసరం. ఆర్థికంగా ఆదాయం మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులు చేయకుండా భవిష్యత్ అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం మంచిది. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు కుటుంబ సభ్యుల సహకారంతో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపించినా వాటిని స్వీకరించే ముందు లాభనష్టాలను అంచనా వేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.

01-09-2026 నుంచి 30-09-2026 వరకు సెప్టెంబర్ మాస ఫలితాలు

01-09-2026 నుంచి 30-09-2026 వరకు సెప్టెంబర్ మాస ఫలితాలుమేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా లెక్క చేసుకుంటారు. అంతా అనుకూలంగా ఫలిస్తుంది. ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అనుకూలమవుతాయి. అపరిచితులతో మితంగా మెలగండి. మీ మంచి కోసం విషయ సేకరణకు కొంత యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. తరచు ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. నోటీసులు అందుకుంటారు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. గృహ నిర్మాణం పూర్తి కావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు పురస్కార యోగం.