Astrology Zodiac Cancer Lov.htm

Notifications

కర్కాటకం కర్కాటకం
ప్రేమ సంబంధం

కర్కాటరాశికి చెందిన వారు అత్యంత ప్రేమ పాత్రులుగా ఉంటారు. ఎవరితోనైనా ప్రేమిస్తే దానిని నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయడానికి సిద్ధపడతారు. తమకు నచ్చిన పద్ధతిలో వారి ఇష్టప్రకారం నడుచుకుంటారు. ప్రేమ విషయంలో వీరి ప్రవర్తన చాలా స్పష్టంగా ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు ఎక్కడ బలంగా ఉంటాయన్న విషయాన్ని, ఎలా బలంగా ఉంచుకోవాలన్న విషయాన్ని తమ సహజ జ్ఞానంతో ముందుగానే పసిగట్టగలుగుతారు.న్యాయం, పారదర్శకంగా ఉండటం అన్న విషయాలలో పరిపూర్ణతను సాధిస్తారే తప్ప పొరపాటుకు ఆస్కారం ఇవ్వదు. ఫలితంగా వీరిని అందరూ ఇష్టపడతారే తప్ప ద్వేషించరు. అంగీకరించే స్వభావం వీరిని ఓ మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేట్లు చేస్తుంది.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో?

ఫిన్లాండ్‌కు 29 మంది ఏపీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు

ప్రధాని మోడి, భాజపా ఎంపి- సినీ నటి కంగనా రనౌత్‌ల డీప్‌ఫేక్ వీడియోలు కలకలం, ఎంత ధైర్యం?

16-08-2026 నుంచి 22-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

16-08-2026 నుంచి 22-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వ్యవహారానుకూలత ఉంది. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఆప్తులను విందుకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. బుధవారం నాడు ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్తయత్నాలు చేపడతారు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సంస్థల స్థాపనలకు రుణాలు మంజూరవుతాయి. మీ చొరవతో వివాదం సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వెండి బంగారు వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆశావహదృక్పధంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. ప్రయాణం కలిసివస్తుంది.

15-08-2026 శనివారం మీ రాశి ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం