Astrology Zodiac Cancer Hlt.htm

Notifications

కర్కాటకం కర్కాటకం
ఆరోగ్యం

కర్కాటక రాశికి చెందిన వారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి. వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశం ఉంది. కనుక ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బాల్యంలో తలెత్తిన కొన్ని శారీరక ఇబ్బందులు పొడసూపే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అవసరం. ఈ రాశికి చెందినవారు త్వరగా మద్యపానం వంటివాటికి అలవాటు పడే అవకాశం ఉంది కనుక వాటికి దూరంగా ఉండటం మేలు. ఇక ఆరోగ్యం కాపాడుకునే విషయంలో ఇంగ్లీషు మందులకన్నా ఆయుర్వేదాన్ని ఆశ్రయించటం ఎంతైనా మంచిది.

ఇంట్లో నల్లటి గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ వాడటం మంచిది కాదా?

krishna Jayanti 2026 worship: శ్రీ కృష్ణుని జయంతి రోజున ఈ ఐదు విషయాలు పాటిస్తే...?

krishna Jayanti 2026 worship: శ్రీ కృష్ణుని జయంతి రోజున ఈ ఐదు విషయాలు పాటిస్తే...?శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన రోజును మనం ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి (కృష్ణ జయంతి)గా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం, శ్రావణ మాసంలో బహుళ పక్ష అష్టమి, రోహిణి నక్షత్రం కలిసిన రాత్రి వేళలో, మధురలోని చెరసాలలో భగవంతుడైన శ్రీకృష్ణుడు అవతరించాడని చెప్పబడింది. అందువల్ల, ఈ మాసంలో వచ్చే కృష్ణ పక్ష అష్టమి రోజున సాయంత్రం వేళలో కృష్ణాష్టమి పూజలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 04, శుక్రవారం నాడు కృష్ణాష్టమి జరుపుకోనున్నారు. ఈ రోజున సాయంత్రం 6 గంటల తర్వాత శ్రీకృష్ణుడిని పూజించాలి. ప్రత్యేకించి, నిశిత కాల పూజ సమయమైన రాత్రి 11:57 నుండి అర్ధరాత్రి దాటాక 12:43 వరకు ఉన్న సమయంలో శ్రీకృష్ణుడిని ఆరాధించడం చాలా విశేషమైనది.

01-09-2026 మంగళవారం రాశి ఫలితాలు... ఇతరుల మాటలను నమ్మి తొందరపడి..?

01-09-2026 మంగళవారం రాశి ఫలితాలు... ఇతరుల మాటలను నమ్మి తొందరపడి..?మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీరు చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. అయితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పరిస్థితులను పూర్తిగా పరిశీలించడం అవసరం. ఆర్థికంగా ఆదాయం మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులు చేయకుండా భవిష్యత్ అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం మంచిది. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు కుటుంబ సభ్యుల సహకారంతో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపించినా వాటిని స్వీకరించే ముందు లాభనష్టాలను అంచనా వేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.