సంబంధిత వార్తలు
- మొక్క పెరిగేవరకు శ్రద్ద తీసుకోవాలి - సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్
- దేశంలో విజృంభిస్తోన్న కరోనా : 24 గంటల్లో 12249 కొత్త కేసులు
- వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించండి.. మాజీ మంత్రి సోమిరెడ్డి
- అగ్నిపథ్‌పై నిర్ణయం తీసుకునే ముందు మా వాదనలు వినండి : సుప్రీంలో కేంద్రం
- యోగా డే వేడుకల్లో సైలెంట్ వారియర్స్
దేశంలో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో 13315 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఈ కేసులు 12 వేలుగా మాత్రమే ఉన్నాయి. 24 గంటల్లో మరో వెయ్యి కేసులకు పైగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,33,44,958గా ఉంది. ఇందులో 4,27,36,027 మంది కరోనా బాధితులు కోలుగా 83990 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇప్పటివరకు 524941 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, గడిచిన 24 గంటల్లో 38 మంది చనిపోగా, ఈ వైరస్ నుంచి 10972 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం కేసుల్లో 0.19 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.60 శాతంగా ఉన్నాయి. మరణాల శాతం మాత్రం 1.21 శాతంగా ఉన్నాయి.
