వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించండి.. మాజీ మంత్రి సోమిరెడ్డి
ఉపరాష్ట్రపతిగా ఉన్న ఎం. వెంకయ్య నాయుడును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి పదవికి సరైన వ్యక్తి వెంకయ్య అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే విపక్షాలు సైతం అభ్యర్థిని బరిలోకి దించేందుకు ఏమాత్రం సహసం చేయబోవని అన్నారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వచ్చే నెల 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. దేశంలో అత్యున్నతమైన, రాజ్యాంగబద్ధమైన పదవి... రాష్ట్రపతి పదవి. ప్రపంచ దేశాలన్నీ ఈ పదవికి గౌరవం ఇస్తాయి. అయితే, ఎన్డీయే, యూపీఏతో సహా ఇతర రాజకీయ పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థి కోసం వెతుకుంటే ఆశ్చర్య కలుగుతుంది. వెంకయ్య నాయుడు వంటి మచ్చలేని మహోన్నత వ్యక్తిని చేతిలో పెట్టుకుని రాష్ట్రపతి అభ్యర్థి కోసం పాకులాడుతున్నాయి. గతంలో ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతులు అయిన సంప్రదాయం ఉంది. వెంకయ్య నాయుడిని నిష్కల్మష జీవితం. ఆయన జీవితం ప్రజలకు అంకితం
ప్రస్తుత పరిస్థితుల్లో అధికారంలో ఉండే ప్రభుత్వ పెద్దలకు, ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా... మీరు వెంకయ్య నాయుడు పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఎలాంటి పోటీలేకుండా రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవడానికి ఇదే సరైన అవకాశం. ఆయన పేరును ప్రకటిస్తే ఆయన పోటీగా అభ్యర్థిగా బరిలో దింపడానికి విపక్షాలు కూడా సాహసించవు. వెంకయ్య నాయుడు వంటి మంచి వ్యక్తి రాష్ట్రపతి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు.