దేశంలో విజృంభిస్తోన్న కరోనా : 24 గంటల్లో 12249 కొత్త కేసులు
దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ విజృంభిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 12249 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,31,645 కు చేరింది.
ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 81,687కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 99.22 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 13 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,24,903 కి చేరింది.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9862 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీల సంఖ్య 4,27,25,055కు చేరింది.