1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (13:58 IST)

అగ్నిపథ్‌పై నిర్ణయం తీసుకునే ముందు మా వాదనలు వినండి : సుప్రీంలో కేంద్రం

supreme court
భారత ఆర్మీలో సైనిక బలగాల నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం అగ్నిపథ్ ఇపుడు సుప్రీంకోర్టుకు చెంతకు చేరింది. ఈ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కనీసం పార్లమెంట్ ఆమోదం కూడా లేకుండానే నియామక ప్రక్రియను మార్చారంటూ పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హర్ష్ అజయ్ సింగ్ అనే న్యాయవాది దాఖలు చేశారు.
 
అగ్నిపథ్ అమలుపై మరోమారు పునరాలోచన చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అంతకుముందు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ అనే ఇద్దరు లాయర్లు కూడా అగ్నిపథ్‌కు వ్యతిరేంగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిన్నింటినీ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 
 
ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకంపై సుప్రీంకోర్టు ఏదేనీ ఆదేశాలు జారీచేసే ముందు తమ వాదనలు కూడా వినాలంటూ కేంద్ర ప్రభుత్వం తరపున ఒక పిటిషన్ దాఖలైంది. అగ్నిపథ్‌కు సంబధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉన్నట్టయితే తమ వైపు నుంచి కూడా వాదనలను వినాలని కేంద్రం కోరింది.