సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (09:44 IST)

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఏకమైన రైతు సంఘాలు - 24న ఆందోళన

rakesh tikait
త్రివిధ దళాల్లో సాయుధ బలగాల నియామకం కోసం కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరుద్యోగులతోపాటు విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పథకానికి నిరసనగా సోమవారం భారత్ బంద్ కూడా నిర్వహించాయి. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ రైతు సంఘాల ప్రతినిధులు కూడా స్పందించాయి. 
 
ఈ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 24వ తేదీన దేశ వ్యాప్త నిరసనలకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన సంఘం సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ తెలిపారు. 
 
జిల్లా, తాహసీల్దారు కార్యాలయాల్లో శుక్రవారం జరిగే నిరసన ప్రదర్శనలకు యువత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు, రాకేష్ టికాయత్ సారథ్యంలోని బీకేయూ కూడా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీన దేశ వ్యాప్త నిరసలనకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.