శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (13:23 IST)

తెలంగాణాలో ఆలస్యంకానున్న ఇంటర్ పరీక్షా ఫలితాలు

రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. త్వరలోనే ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల వెల్లడిలో జాప్యం కానుంది. నిజానికి ఈ నెల ఆరంభంలోనే ఈ ఫలితాలను వెల్లడిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఇంటర్ బోర్డు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక జూన్ 15వ తేదీన ఈ ఫలితాలను వెల్లడించనున్నారనే వార్తలు వచ్చాయి. 
 
కానీ, ఆ రోజు కూడా గడిచిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇంటర్ ఫలితాలు ఎపుడు వెల్లడవుతాయన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. కనీసం ఈ నెలాఖరైనా ఈ ఫలితాలను విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. అయితే, తెలంగాణ విద్యా శాఖ అధికారుల వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.