సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (13:11 IST)

తన పోలికలు లేవని చిన్నారని పొట్టనబెట్టుకున్న కన్నతండ్రి

కట్టుకున్న భార్య పేగు తెంచుకున్న పుట్టిన బిడ్డకు తన పోలికలు లేవన్న ఓ కన్నతండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. రెండు నెలల కన్నబిడ్డను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పుట్టిన బిడ్డ తన పోలికలతో లేదంటూ భార్యతో మల్లిఖార్జున అనే వ్యక్తి గొడవపడ్డాడు. గురువారం రాత్రి ఇంట్లో నుంచి తన రెండు నెలల బిడ్డను తీసుకుని పారిపోయిన తండ్రి మల్లిఖార్జున కన్నబిడ్డను చంపేసి ఓ చేతి సంచిలో ఉంచాడు. 
 
పాప నోటికీ ప్లాస్టర్‌ వేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. మృతి చెందిన పాపను తల్లికి అప్పగించి… నిందితుడు మళ్లి ఖార్జున కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.