గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (12:33 IST)

గుంటూరులో కలకలం : 3 రోజుల పసికందు అపహరణ

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరులో దారుణం జరిగింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందు అపహరణకు గురైంది. ఈ ఘటన గుంటూరు జీజీహెచ్‌లో పసికందు అదృశ్యమవ్వడం జిల్లాలో కలకలం రేపుతోంది. 
 
పెదకాకానికి చెందిన ప్రియాంక అనే మహిళ 12వ తేదీన జీజీహెచ్‌లో ప్రసవించింది. ఈ క్రమంలో రాత్రి వేళ 1.30 సమయంలో బాబుని తీసుకుని నాయనమ్మ, అమ్మమ్మ వార్డ్ బయటకు వచ్చారు. అనంతరం బాబుని పక్కన ఉంచుకుని నిద్రపోయారు. 
 
దీంతో అప్రమత్తమైన వారు జీజీహెచ్‌ అధికారులకు, పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ఇద్దరు అనుమానితులను గుర్తించారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు.