శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (13:29 IST)

చెడు వ్యసనాలకు బానిసైన అల్లుడుని హతమార్చిన అల్లుడు

ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. చెడు వ్యసనాలకు బానిసై భార్యను నిత్యం వేధిస్తున్న అల్లుడుపై మామ, బావమరిది కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిన్న కాశిం అనే వ్యక్తి గత కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. నిత్యం భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. చెడు వ్యసనాలు మానుకోవాలని భార్య కుటుంబీకులు చెప్పినా.. చిన్న కాశిం తీరులో మార్పు రాలేదు. 
 
ఇదే  విషయంపై చిన్న కాశింను అతని మామ నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో చిన్న కాశింపై అతని మామ, బావ మరిది కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన చిన్న కాశింను చికిత్స కోసం పిడుగురాళ్ల ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు.
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. మామా పిరు సాహెబ్, బావ మరిది భాషాలను  అదుపులోకి తీసుకున్నారు. అల్లుడిపై మామ, బావ మరిది కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.