మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , శనివారం, 25 సెప్టెంబరు 2021 (17:04 IST)

కోరం లేక దుగ్గిరాల మండలం పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక వాయిదా

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి రామ్ ప్రసన్నతెలిపారు. ప్రత్యేక సమావేశానికి కావలసిన కోరం తొమ్మిది మంది సభ్యులు హాజరులేకపోవటంతో రెండు సార్లు ప్రత్యేక సమావేశం వాయిదా వేశారు. ఇలా హాజ‌రు లేక రెండు సార్లు ప్రత్యేక సమావేశం వాయిదా పడి అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయిన అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు నివేదించి తదుపరి ఉత్తర్వులు కోసం ఎద‌రు చూస్తాం అని ఎన్నికల అధికారి రామ్ ప్రసన్నతెలిపారు. 
 
అయితే, దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష పీఠం ఖచ్చితంగా త‌మ‌దే అని మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించి తాము ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులతో ప్రత్యేక సమావేశానికి హాజర‌య్యామ‌ని, ప్రలోభ రాజకీయాలకు తెరలేపినది తెలుగుదేశం పార్టీ నాయకులేనని అన్నారు. నిన్న సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసిన ఆడియో బహిర్గతం చేశారు. ప్రత్యేక సమావేశానికి ఎందుకు తేదేపా హాజరు కావటం లేదో  ప్రజలకు వివరణ ఇవ్వాల‌న్నారు. 
 
రెండు సార్లు ప్రత్యేక సమావేశం వాయిదా పడినది నేపథ్యంలో తదుపరి చర్యల‌కై ఎలక్షన్ కమిషన్ నివేదిక పంపుతున్నట్లు  రిటర్నింగ్ ఆఫీసర్ తెలియజేశారు. అయితే, త‌న‌కున్న పరిజ్ఞానం ప్రకారం మూడవ సారి నిర్వహించే ప్రత్యేక సమావేశంలో కోరం లేకుండానే ఎంపీపీ ఎన్నిక జరగవచ్చని చట్టం చెపుతున్ననేపథ్యంలో, తప్పక వైఎస్ఆర్సిపి  అధ్యక్ష పీఠం కైవసం చేసుకుంటుంద‌ని ఎమ్మెల్యే చెప్పారు.