1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 23 సెప్టెంబరు 2021 (12:32 IST)

గుంటూరు జిల్లాలో 13 మంది తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు

గుంటూరు జిల్లాలో ప్రజలు రెవెన్యూ సేవల కోసం అందించిన ధరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తున్న 13 మంది తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మ‌రో 12 మంది విలేజ్ రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేస్తూ  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
 
జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్లు సచివాలయాల తనిఖీల సమయంలో రెవెన్యూ సేవలను బియాండ్ ఎస్ఎల్ఏ లో పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఏ లో పరిష్కరిస్తున్న వారి పనితీరు మెరుగుపరుచుకోవాల‌ని హెచ్చ‌రించారు. తగినంత సమయం ఇచ్చి, వీడియో కాన్ఫరెన్స్ లు, టెలికాన్ఫరెన్స్ ల ద్వారా పదే పదే సూచనలు ఇచ్చినప్పటీకీ, రెవెన్యూ సేవల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూన్న వీరిపై ఎట్ట‌కేల‌కు చర్యలు తీసుకున్నారు. 
 
జిల్లాలో రెవెన్యూ సేవలను బియాండ్ ఎస్ఎల్ఏలోను పరిష్కారంలో అట్టడుగు పనితీరులో ఉన్నందున  అచ్చంపేట మండలం లోని వేల్పురు, అచ్చంపేట, గుంటూరు పశ్చిమ మండలం లోని పొత్తూరు, కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల 1, ఒప్పిచర్ల 2, గురజాల మండలంలోని గంగవరం, ఈపూరు మండలంలోని వనికుంట, నాదెండ్ల మండలంలోని నాదెండ్ల 1, బొల్లాపల్లిలోని రెమిడిచర్ల, భట్టిప్రోలు మండలంలోని పెదపులివర్రు, కాకుమాను మండలంలోని గార్లపాడు, పొన్నూరు మండలంలోని పెదపాలెం సచివాలయంలోని 12 మంది గ్రామ రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
గుంటూరు తూర్పు మండలం, గుంటూరు పశ్చిమ మండలం, అచ్చంపేట, సత్తెనపల్లి, రెంటచింతల, కారంపూడి, దాచేపల్లి , నకరికల్లు, ఈపూరు, యడ్లపాడు, బాపట్ల, తెనాలి, పొన్నూరు మండల తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టరు ఉత్తర్వులలో పేర్కోన్నారు.