శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (14:01 IST)

తితిదే హౌస్ బిల్డింగ్ లోన్‌లో గోల్‌మాల్ - 49 మంది షోకాజ్ నోటీసులు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని హౌస్ బిల్డింగ్ లోన్‌లో అవకతవకలు పాల్పడినందుకుగాను తితిదే ఈవో జవహర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి 49 మందికి షోకాజ్ నోటీసులు పంపించారు. 
 
ఒక్కసారిగా దాదాపు 50 మందికి నోటీసులివ్వడం తితిదే చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. నోటీసులు అందుకున్న వారిలో డిప్యూటీ ఈవో నుంచి అటెండర్ స్థాయి ఉద్యోగులు ఉండగా.. మరికొంత మంది ఉద్యోగులకూ నోటీసులు జారీ చేసే అవకాశముంది. కాగా ఇటీవలే ఆర్జిత సేవా టికెట్ల స్కాంలో ఏడుగురు ఉద్యోగులను టీటీడీ డిస్మిస్ చేసింది.