శనివారం, 23 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (11:04 IST)

సర్వదర్శనం టిక్కెట్ల జారీ... రోజుకు 2 వేల టోకెన్లు.. క్యూ కట్టిన భక్తులు

తిరుమలలో ఐదు నెలల తర్వాత ఉచిత దర్శనాలు ప్రారంభమయ్యాయి. తాజాగా సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. అయితే బుధవారం చిత్తూరు జిల్లావాసులకే టోకెన్లను పరిమితం చేశారు.
 
అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో రోజుకు 2 వేల టోకెన్లు ఇచ్చేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో అఖిలాండ బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు చిత్తూరు జిల్లా భక్తులు పోటీపడుతున్నారు. 
 
కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాదిన్నరగా శ్రీవారి సర్వదర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది. ప్రస్తుతం ప్రత్యేక ప్రవేశదర్శన టోకెన్లను మాత్రమే టీటీడీ జారీ చేస్తోంది.
 
ప్రత్యేక ప్రవేశ దర్శనం, ప్రముఖుల సిఫార్సులు, వర్చువల్ సేవా టోకెన్ల ద్వారా రోజుకు 20వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఒక కౌంటర్‌లో మాత్రమే టిక్కెట్లను జారీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన స్థానిక భక్తులకు మాత్రమే సర్వదర్శన టిక్కెట్లను జారీ చేస్తున్నారు.