మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (19:54 IST)

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... అక్టోబర్ 1 నుంచి అలిపిరి..?

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. సర్వ దర్శనం టోకెన్ల జారీ పై టీటీడీ కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అలిపిరి వద్ద రోజుకి 2వేల చొప్పున టోకెన్లు జారీ చేయాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు టోకెన్లు జారీని పరిమితం చేయనుంది టిటిడి పాలక కమిటీ. 
 
సర్వ దర్శనం టోకెన్ల జారీతో భక్తులకు కాస్త ఊరట లభించనుంది. కాగా కరోనా మహమ్మారి కారణంగా కొన్ని రోజులుగా సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే అక్టోబర్‌ 1 నుంచి అలిపిరి నడక మార్గంలో భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక కమిటీ. ఈ నెల 13 నుంచి తిరుమలలో అగరబత్తీలు భక్తులకు అందుబాటులోకి వస్తాయని.. చెప్పింది టీటీడీ పాలక కమిటీ.