1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (11:58 IST)

తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు కేసీఆర్ తీపికబురు

తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపి కబురు అందించనున్నారు. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ.. సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ జారీ చేసే ఫైల్‌పై సీఎం కెసిఆర్ సంతకం చేయనున్నారు. దీంతో 120 మందికి సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు దక్కనున్నాయి. 59 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు… సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతులు పొందనున్నారు.
 
అటు 33 మంది సెక్షన్ ఆఫీసర్లు అసిస్టెంట్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు. 20 మంది అసిస్టెంట్ సెక్రెటరీలు డిప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు.  8 మంది డిప్యూటీ సెక్రెటరీలు జాయింట్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు.
 
నలుగురు జాయింట్ సెక్రెటరీలు అడిషనల్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు. ఈ మేరకు కాసేపట్లో నే జీవో విడుదల కానుంది. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.