గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (15:36 IST)

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 16 యేళ్ల బాలిక.. ఎక్కడ?

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో అభంశుభం తెలియని 16 యేళ్ళ బాలిక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ మైనర్ బాలిక బలవ్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని గాంధారి మండలంలోని ఓ గిరిజన తండాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గిరిజన తండాకు చెందిన మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఓ ఓ యువకుడు నమ్మించి శారీరకంగా కలిశాడు. దీంతో ఆ యువతి గర్భందాల్చింది. 
 
ఈ విషయం తెలిసిన యువకుడు ఆ యువతికి ముఖం చాటేసాడు. ఈ క్రమంలో ఆ మైనర్ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి జన్మనిచ్చిన తర్వాత దుర్గం చెరువు సమీపంలోని ముళ్లపొదల్లో శిశువును బాధితురాలు వదిలేసింది.
 
అనంతరం బాధితురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకొంది. బావిలో నుండి మృతదేహన్ని వెలికితీసి పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. ముళ్ల పొదల్లో ఉన్న శిశువును గుర్తించిన స్థానికులు వైద్య ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 
 
ఆంబులెన్స్‌లో ఆ చిన్నారిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. కాగా మైనర్ బాలికను గర్భవతిని చేసిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు విచారణ చేపట్టారు.