గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (08:26 IST)

16ఏళ్ల బాలికపై అనేక సార్లు సామూహిక అత్యాచారం.. 10 రోజుల్లో నిందితుల అరెస్ట్

దేశంలో మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఓ యువతిపై కర్ణాటకలో సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, బెళగావి జిల్లాలోని గోకాక్‌ తాలూకాలో సామూహిక అత్యాచార సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
ఫిర్యాదు అందిన పది గంటల్లోనే కామాంధుల్ని అరెస్టు చేశారు పోలీసులు. గోకాక్‌ తాలూకాలోని ఘటప్రభా పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో 20 రోజుల క్రితం 16ఏళ్ల బాలికపై ఐదుగురు కామాంధులు సామూహికంగా అత్యాచారం చేశారు.  
 
ఈ విషయం తెలిస్తే తమ పరువు పోతుందనే బాధతో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయలేదు. దీంతో బాధితురాలిపై పలుమార్లు బెదిరింపులకు పాల్పడిన కామాంధులు అనేక సార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో పాటు రోజు రోజుకీ కామాంధుల నుంచి బెదిరింపులు అధికం కావడంతో పోలీసుల్ని ఆశ్రయించారు బాధితురాలి తల్లిదండ్రులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.