శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (15:44 IST)

యూపీలో 14 ఏళ్ల బాలికపై ఐదుగురి సామూహిక అత్యాచారం..

యూపీలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆ రాష్ట్రంలోని రాంపూర్‌లో ఓ 14 ఏండ్ల బాలికను అయిదుగురు దుండగులు కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వరండాలో నిద్రిస్తున్నది. ఆ సమయంలో ఓ అయిదుగురు దుండగులు.. ఇంట్లోకి వచ్చి బాలిక నోట్లో గుడ్డలు కుక్కి కిడ్నాప్‌ చేశారు. 
 
నిందితులలో ఒకరికి చెందిన దుకాణానికి తీసుకెళ్లి అక్కడ సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆమె ఇంటి సమీపంలో వదిలి వెళ్లారు. స్పృహలోకి వచ్చిన తర్వాత బాలిక తన కుంటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని తెలిపింది. 
 
దాంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఐదుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 
రాంపూర్ ఎస్పీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ ఐదుగురు నిందితులలో ఒకరితో బాలికకు స్నేహం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. అయితే బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారణ కాలేదని చెప్పారు. 
 
అయితే కేసు తీవ్రత, చేస్తున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మేజిస్ట్రేట్ ముందు బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని ఆయన చెప్పారు.