శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (16:52 IST)

మేక పిల్లను ముళ్ల పొదల్లో వేసేందుకు వెళ్లిన చిన్నారి.. కాపుకాసి కాటేసిన కామాంధుడు

తమ ఇంట్లో చనిపోయిన చిన్న మేక పిల్లను ముళ్ల పొదల్లో వేసేందుకు వెళ్లిన తొమ్మిదేళ్ల చిన్నారిపై మదమెక్కిన 14 యేళ్ల మైనర్ బాలుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణం కడప జిల్లా చక్రాయపేటలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చక్రాయపేటకు చెందిన 9 యేళ్ల మైనర్ బాలిక తమ ఇంట్లో చనిపోయిన మేక పిల్లను గ్రామ సమీపంలోని కంప చెట్ల వద్దకు వెళ్లింది. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న మదమెక్కిన 14 యేళ్ళ బాలుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. పసిపాప బట్టలు మొత్తం చింపి నోటికి గుడ్డ కట్టి దారుణానికి ఒడిగట్టడంతో నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ ఆ బాలిక ఉండిపోయింది.
 
అయితే పాప ఎంత సేపటికీ రాకపోవడంతో ఆ చిన్నారి మేనత్త వెళ్లి చూడగా.. ఈ దారుణం వెలుగులోకి వచ్చిందని బాలిక తండ్రి ఆవేదనతో చెప్పాడు. బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి న్యాయం చేయాలంటూ చక్రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
మరోవైపు, కడప జిల్లాలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో బాధిత కుటుంబానికి రాష్ట్ర మహిళా కమిషన్ అండగా నిలిచింది. జిల్లా ఎస్పీతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. బాలిక తల్లిదండ్రులతో ఆమె మాట్లాడి ధైర్యం చెప్పారు.