సోమవారం, 25 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (09:32 IST)

అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన తండ్రి.. ప్రియురాలికి వీడియో కాల్ చేసి తండ్రిపై దాడిని చూపించిన కొడుకు

attack
చిత్తూరులో మరో దారుణం జరిగింది. పరాయి స్త్రీతో తాను కొనసాగిస్తున్న వివాహేతర సంబంధాన్ని తండ్రి ప్రశ్నించడంతో కుమారుడు జీర్ణించుకోలేక పోయాడు. తండ్రిపై కక్ష పెంచుకుని దాడి చేశాడు. తండ్రిని కొడుతున్న విషయాన్ని తన ప్రియురాలికి వీడియో కాల్ చేసిమరీ చూపించాడు. 
 
తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రగిలిపోయిన కుమారుడు ఈ దాడికి తెగబడ్డాడు. కుమారుడి దాడిలో తండ్రి తీవ్రంగా గాయపడగా, ఇరుగుపొరుగువారు ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చిత్తూరులో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
స్థానికంగా హోంగార్డుగా పని చేసే ఢిల్లీబాబు కుమారుడు భరత్ (21) కూలి పనులు చేస్తుంటాడు. ఈ యువకుడు  ఇటీవల 39 యేళ్ల మహిళతో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన తండ్రి కుమారుడిని మందలించాడు. అయినప్పటికీ భర్త‌లో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భరత్‌ను ఠాణాకు పిలిపించిన పోలీసులు.. మందలించి పంపించి వేశారు. 
 
ఈ చర్యను భరత్ జీర్ణించుకోలేక పోయాడు. తండ్రిపై కక్ష పెంచుకున్న భరత్.. ఆదివారం సాయంత్రం తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి తండ్రిపై దాడి చేస్తున్న దృశ్యాలను చూపించాడు. తలపై కర్రతో భరత్ బలంగా కొట్టడంతో ఢిల్లీబాబుకు బలమైన దెబ్బ తగిలి రక్తస్రావమైంది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.