ఆంధ్రమాతగా పిలవబడే గోంగూర అంటే తెలుగువారిలో చాలామందికి అమితమైన ఇష్టం. గోంగూరను రోజూ తింటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. గోంగూరలో చాలా మూలిక గుణాలున్నాయి. గోంగూరతో మంచి రుచికరమైన కూరలు, పచ్చళ్లు చేసుకుని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గోంగూరను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. తరచూ గోంగూరను తినడం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం. 1. కొందరు రేచీకటికితో ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారు తరచూ గోంగూరను...