'మేము సైతం'తో నేను మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ అయ్యాను : మంచులక్ష్మి
''నాకు ఎప్పుడూ కొత్తదనమే ఇష్టం. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటాను. మిగతా వాళ్ళందరూ చేసేది నేను చేయను. నేను చేసేది వాళ్ళెవరూ చేయలేరు. సినిమా అనేది పోటీ తత్త్వంతో కూడుకున్న పరిశ్రమ. ఎప్పటికప్పుడు
''నాకు ఎప్పుడూ కొత్తదనమే ఇష్టం. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటాను. మిగతా వాళ్ళందరూ చేసేది నేను చేయను. నేను చేసేది వాళ్ళెవరూ చేయలేరు. సినిమా అనేది పోటీ తత్త్వంతో కూడుకున్న పరిశ్రమ. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్తగా ఉండేలా చూసుకోవాలి'' అని నటి మంచు లక్ష్మీ తెలియజేశారు. అటు సినిమాలోనూ, ఇటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే ఆమె పుట్టినరోజు ఈ నెల ఎనిమిది. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు.
ఈ ఏడాది బాగుంది. మర్చిపోలేను. అనుకున్నవన్నీ జరిగిపోయాయి. మా ఫ్యామిలీ అందరూ బాగున్నారు. అమ్మ, నాన్న, నా మేనకోడళ్లు అందరితో లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతోంది. ముఖ్యంగా నా కూతురు. బిడ్డ పుడితే ఎలా చేయాలి, టైమ్ సరిపోదు కదా అని కంగారు పడ్డాను. కానీ నా పాప వచ్చాక నా ప్రపంచమే మారిపోయింది. నా పాపే నా లోకమయింది.
'మేము సైతం' గురించి...
మొదట 'మేము సైతం' ప్రోగ్రాం ప్రారంభించినప్పుడు నేను పదిమందికి హెల్ప్ చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉండేది. కానీ ప్రోగ్రామ్ చేశాక వాళ్ళే నాకు హెల్ప్ చేస్తున్నారనిపిస్తోంది. మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా తయారయ్యాను. భాధలు ఎలా ఉంటాయో, సహాయం ఎలా చేయాలో తెలుసుకున్నాను. దాదాపు అందరినీ ఈ షోకి పిలిచాను. రాని వాళ్ళ చాలామందున్నారు. కొందరు వస్తామని చెప్పి రాలేదుకూడా. వాళ్ళకి సహాయం చేసే అదష్టం లేదనే అనుకుంటాను. కానీ, నేను హీరో ప్రభాస్‌ని షోకి పిలవలేదు. ఆయన 'బాహుబలి' షూటింగ్లో బిజీగా ఉన్నారు. మళ్ళీ పిలిస్తే రాజమౌళిగారికి కోపం వస్తుంది. అందుకే ఆయన్ను ఇప్పటివరకూ పిలవలేదు.
కొత్త సినిమా
ఈమధ్యే ఓ సినిమా ఒప్పుకున్నాను. అది కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా వుంటుంది. కాగా, ప్రస్తుతం 'లక్ష్మీ బాంబ్' అనే సినిమా చేస్తున్నాను. ఆ టైటిల్ నిర్మాతలు కథ చెప్పేటప్పుడే నిర్ణయించుకుని నాకు చెప్పారు. మొదట నచ్చలేదు. వర్కింగ్ టైటిల్‌గా ఉంచి తరువాత చూద్దాం అన్నాను. కానీ వాళ్ళు మాత్రం అదే ఉంచాలన్నారు. తరువాత కథ చూస్తే అదే కరెక్ట్ అనిపించింది. అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక ఈ సినిమా ఫ్యామిలీ, హర్రర్ డ్రామాగా ఉంటుంది.
గోల్స్ లేవు..
నాకైతే ఎలాంటివో గోల్స్, టార్గెట్స్ లేవు. మా కుటుంబమంతా బ్రతికేది కళామతల్లి వలనే. కాబట్టి ఎప్పటికీ సినిమాలు చేస్తూ ఒక మంచి ఆర్టిస్ట్ గానే ఉండిపోవాలన్నది నా ఆశ. ఫలానా సెలబ్రటీ షో చేస్తే ఎక్కువ ఫండ్స్ వస్తాయి. వాళ్ళతోనే చేయాలి అని అనుకోలేదు. సహాయం ఎవరు చేసినా సంతోషమే. నా షోకి వచ్చిన వాళ్లంతా షో పూర్తయ్యాక ఇస్తామన్న టైమ్‌కి డబ్బులు ఇచ్చేశారు. అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు.
డ్రీమ్ ప్రాజెక్ట్..
నాన్నతో ఓ ఫుల్ లెంగ్త్ సినిమా తీయాలని ఉంది. కానీ మంచి కథ దొరకడం లేదు. కథ ఎలా ఉండాలంటే నటిగా నాకు సవాల్ విసిరేలా ఉండాలి. అలాంటి కథ దొరికితే నేను తప్పకండా చేస్తాను.
పరిశ్రమలో మార్పులు రావాలి..
పరిశ్రమలో ఓ మార్పు రావాలి. బాగా చదువుకున్న ఆడవాళ్లు పరిశ్రమలోకి రావాలి, మంచి మంచి సినిమాల్లో నటించాలి. ఇప్పటికి పరిశ్రమలో ఆడవాళ సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి ఆడవాళ్లు ముందుకొచ్చి సినిమాలు చేయాలనేది నా కోరిక.