seasonal diseases, వేపతో సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట
వర్షాకాలం ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు కూడా వచ్చేస్తాయి. వీటిలో జలుబు, ఫ్లూ జ్వరం, చర్మ సంబంధిత సమస్యలు సంక్రమిస్తుంటాయి. వీటన్నిటినీ అడ్డుకునే శక్తి వేపకు వున్నది. సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట వేయగల వేప చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.
వేప ఆకులను నమిలితే... తాజాగా వున్న 2 నుంచి 3 లేత ఆకులను నమిలితే రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా శరీరానికి డిటాక్స్‌గా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
వేప ఆకుల నీరు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. పది లేత ఆకులను తీసుకుని పొయ్యి మీద మరిగించి చల్లార్చి వడగట్టి ఆ నీటిని తాగితే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
చర్మంపైన వచ్చే దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గేందుకు వేప ఆకుల పేస్టును రాస్తుంటే ప్రయోజనం వుంటుంది.
చర్మం దురదలకు, ఇతర చర్మ సంబంధ సమస్యలు వున్నవారు వేప ఆకులను మరిగే నీటిలో వేసి ఆ నీటిని వడగట్టి స్నానం చేసే నీటిలో కలుపుకుని చేస్తే దురదలు తగ్గుతాయి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. వేప అధికంగా సేవిస్తే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి కనుక నిపుణులను సంప్రదించి వాడాలి.
