1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
  4. Eating ridge gourd causes calf cramps in some people, why?

Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?

calf cramps
కొందరికి బీరకాయలు పడవు అంటారు. ముఖ్యంగా బీరకాయ తిన్నప్పుడు పిక్కలు పట్టేయడం (Leg Cramps) అనేది అందరికీ జరిగే విషయం కాదు. కొంతమందిలో ఇది జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన పెద్దలు చెప్పే చలవ చేయడం లేదా వాయువు అనే అంశాలు దీని వెనుక ఉన్నాయి.
 
బీరకాయ శరీరానికి అమితమైన చలవ చేస్తుంది. ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం ప్రకారం, శరీరం అతిగా చల్లబడినప్పుడు రక్త ప్రసరణలో వేగం తగ్గి, కండరాలు ముఖ్యంగా కాళ్ళ పిక్కలు బిగుసుకుపోయే అవకాశం ఉంటుంది. అలాగే బీరకాయలో నీటి శాతం చాలా ఎక్కువ. ఇది నేచురల్ డ్యూరెటిక్‌గా పనిచేస్తుంది. అంటే ఇది తిన్నప్పుడు మూత్ర విసర్జన ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల శరీరంలోని సోడియం లేదా పొటాషియం వంటి ఖనిజ లవణాలు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతే, పిక్కలు పట్టేయడం లేదా తిమ్మిర్లు రావడం జరుగుతుంది.
 
బీరకాయ వాయు తత్వాన్ని కలిగి ఉంటుంది. సరిగ్గా జీర్ణం కాకపోతే శరీరంలో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఈ గ్యాస్ రక్తనాళాలపై లేదా నరాలపై ఒత్తిడి తెచ్చినప్పుడు పిక్కల్లో నొప్పి లేదా పట్టేసినట్లు అనిపించవచ్చు. చాలామందికి రాత్రిపూట బీరకాయ తింటే ఈ సమస్య వస్తుంది. రాత్రిపూట వాతావరణం చల్లగా ఉండటం, దానికి తోడు బీరకాయ చలవ చేయడం వల్ల కండరాలు త్వరగా రియాక్ట్ అవుతాయి.
 
అందువల్ల బీరకాయ వండేటప్పుడు అందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర లేదా వాము తప్పనిసరిగా వేయాలి. ఇవి వాయువును హరించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కూరలో పచ్చిమిర్చికి బదులు కొంచెం మిరియాల పొడి వాడితే ఆ చలవ ప్రభావాన్ని తగ్గిస్తుంది. బీరకాయ తిన్న రోజున ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవ్వడానికి మంచి నీరు ఎక్కువగా తాగాలి. ఐతే పొరపాటున కూడా చేదుగా ఉన్న బీరకాయ తినకండి, అది కండరాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.
About Writer
సిహెచ్
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?