1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
  4. children's body mass index chart

చిన్నారుల్లో ప్రతి ఐదుగురిలో ఇద్దరికి హెల్తీ బాడీ మాస్ ఇండెక్స్ లేదట!

children's body mass index chart
దేశంలోని చిన్నారుల్లో ప్రతి ఐదుగురిలో ఇద్దరు పిల్లల్లో హెల్తీ బాడీ మాస్ ఇండెక్స్ సరిగ్గా లేదని ఎడ్యూస్పోర్ట్స్ అనే సంస్థ నిర్వహించిన తాజాగా సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేను 2014-15 సంవత్సరానికిగాను నిర్వహించింది. దేశంలోని 26 రాష్ట్రాల్లో ఉన్న 87 పట్టణాల్లో చదువుకుంటున్న పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఈ సంస్థ నివేదిక తయారుచేసింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పాఠశాలల్లో పిల్లలకు శారీరక, క్రీడా సంబంధ విద్య అందించడంలో స్కూళ్లన్నీ అలసత్వం ప్రదర్శిస్తున్నాయని తేల్చి చెప్పింది. ముఖ్యంగా ర్యాంకుల సాధనే లక్ష్యంగా చిన్నారలను మెదడును అరగదీసి.... యంత్రికంగా మార్చివేస్తున్నట్టు తెలిపింది. 
 
పిల్లల శరీరానికి సరైన వ్యాయామం, శ్రమ లేకపోవడంతో వారికి చిన్నవయస్సులోనే అనవసర కొవ్వు పేరుకుపోవడం, స్థూలకాయం, పర్‌ఫెక్ట్ బీఎంఐ లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయని ఎడ్యూస్పోర్ట్ సంస్థ ప్రకటించిన నివేదికలో వెల్లడైంది. పిల్లలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ అందించకుండా పరిస్థితి ఇలాగేకొనసాగితే భారతదేశం కాస్త భారీకాయ దేశంగా మారిపోతుందని ఎడ్యూస్పోర్ట్స్ సీఈవో శ్యామ్యూల్స్ మంజూదార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
About Writer
pnr